అభిమానుల‌కు గుడ్‌న్యూస్‌.. కానీ 332 కోట్ల మెలిక! | FIFA WC 2026-India Broadcast Deal-Done-Zee-Has-To-Pay Huge Amount | Sakshi
Sakshi News home page

FIFA WC 2026: అభిమానుల‌కు గుడ్‌న్యూస్‌.. కానీ 332 కోట్ల మెలిక!

May 30 2026 2:31 PM | Updated on May 30 2026 3:33 PM

FIFA WC 2026-India Broadcast Deal-Done-Zee-Has-To-Pay Huge Amount

భార‌త్‌లో ఫుట‌బాల్‌కు ఆద‌ర‌ణ త‌క్కువే అయిన‌ప్ప‌టికీ.. బెంగాల్‌, కేర‌ళ‌, ముంబై, హైద‌రాబాద్ వంటి న‌గ‌రాల్లో ఫుట్‌బాల్ ఆట‌కు య‌మ క్రేజ్ ఉంటుంది. భార‌త్‌లో కూడా ఇండియ‌న్ సూప‌ర్ లీగ్ (ఐఎస్ఎల్) పేరిట ఫుట్‌బాల్ టోర్నీలు నిర్వ‌హిస్తుండ‌డంతో ఆద‌ర‌ణ పెరుగుతున్న‌ది. ఇక ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు ఉన్న క్రేజ్ వేరు. ఈ మ్యాచ్‌లు లైవ్‌లో వీక్షించాల‌ని ప్ర‌తీ దేశం భావిస్తోంది. 

అయితే భార‌త్‌లో మాత్రం మొన్నటిదాకా ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచ్‌ల‌ను లైవ్‌లో వీక్షించే అవ‌కాశం లేకుండేది. అయితే తాజాగా భార‌త ఫుట్‌బాల్ అభిమానుల‌కు ఒక గుడ్‌న్యూస్‌. జూన్ 11 నుంచి ప్రారంభం కానున్న ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచ్‌లను లైవ్ టెలికాస్ట్ చేసేందుకు జీ నెట్‌వ‌ర్క్‌ ముందుకు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఒప్పందం కూడా దాదాపు పూర్త‌యింది. 

మ‌రో 24-48 గంట‌ల్లో ఒక ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల కానుంది. అయితే ఫిఫా మ్యాచ్‌ల ప్ర‌సార హ‌క్కుల్ని జీ నెట్‌వర్క్‌ పొందాలనుకుంటే సదరు ఫిఫా బ్రాడ్‌కాస్టర్లకు 30 నుంచి 35 మిలియ‌న్ డాల‌ర్లు (సుమారుగా రూ. 284 నుంచి 332 కోట్లు) చెల్లించాల్సి ఉంటుంది. ఇది భారీ మొత్తం కావ‌డంతో జీ నెట్‌వ‌ర్క్‌ వెనుక‌డుగు వేసిన‌ప్ప‌టికీ చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. అయితే జీతో పాటు సోని పిక్చ‌ర్స్ నెట్‌వ‌ర్క్ కూడా ప్ర‌సార హ‌క్కుల‌ను ద‌క్కించుకునేందుకు పోటీలో ఉంది. 

అయితే సోనీ నెట్‌వ‌ర్క్ మాత్రం బిడ్ దాఖ‌లు చేయ‌లేదు. దీంతో ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్ మ్యాచ్‌ల ప్ర‌సార హ‌క్కుల‌ను జీ నెట్‌వ‌ర్క్  సొంతం చేసుకోవ‌డం లాంఛ‌న‌మే అని చెప్పొచ్చు. ఇక జీ నెట్‌వ‌ర్క్ కొత్త‌గా నాలుగు స్పోర్ట్స్ చానెల్‌ల‌ను లాంచ్ చేసింది. యునైటెడ్ స్పోర్ట్స్ 1, యునైట్ 8 స్పోర్ట్స్ హెచ్‌డీ (హిందీ), యునైట్ 8 స్పోర్ట్స్ 2 (ఇంగ్లీష్‌), యునైట్ 8 స్పోర్ట్స్ హెచ్‌డీ (ఇంగ్లీష్) లాంచ్ చేసింది. 

జూన్ 11 నుంచి ప్రారంభం కానున్న ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో మొత్తం 104 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఒప్పందం ఖరారైతే మాత్రం ఈ మ్యాచ్‌ల‌న్నింటి నాలుగు చానెల్స్‌లోనూ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం కానున్నాయి. మొత్తంగా మొన్న‌టిదాకా ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచ్‌ల‌ను వీక్షించే భాగ్యం లేకుండా  పోయింద‌ని తెగ బాధ‌ప‌డిపోయిన అభిమానుల‌కు ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.

చదవండి: ‘నువ్వొక అద్భుతం’.. థాంక్యూ వైభ‌వ్ సూర్యవంశీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement