యువరాజ్‌ తండ్రి వివాదాస్పద వ్యాఖ్యలు! | Ex-Cricketer Yuvraj Singh Father Yograj Controversial Comments | Sakshi
Sakshi News home page

Yograj Singh: యువరాజ్‌ తండ్రి వివాదాస్పద వ్యాఖ్యలు!

Mar 28 2026 12:26 PM | Updated on Mar 28 2026 12:34 PM

Ex-Cricketer Yuvraj Singh Father Yograj Controversial Comments

భారత మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ వివాదంలో చిక్కుకున్నారు. లింగ వివక్షకు సంబంధించి ఘాటైన వ్యాఖ్యలు చేసి ఇబ్బందుల్లో పడ్డారు. ఆటగాళ్లు తమ కెరీర్‌కు వీడ్కోలు పలకడం వెనుక వారి ఇంటి మహిళలు, పిల్లలే ప్రధాన కారణమని పేర్కొనడం ఆసక్తి కలిగించింది. 

రిటైర్మెంట్‌కు ఫిట్‌నెస్‌తో సంబంధం ఉండదని, ఆటగాడి కెరీర్‌కు మహిళలు అడ్డురాకూడదని పేర్కొన్నారు. మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగ్‌రాజ్ సింగ్ మాట్లాడుతూ.. ‘ 40 ఏళ్లు దాటిన తర్వాత మాకు వయసైపోతుందని చాలా మంది అనడం గమనిస్తున్నా. 30 ఏళ్ల తర్వాత మహిళలు ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నారు. 

అందుకే ఒక జిమ్ డైరెక్టర్‌గా నా జిమ్‌కు వచ్చే మహిళలకు, సీనియర్ సిటిజన్లకు ఫిట్‌నెస్‌పై దృష్టి సారించేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని నిర్ణయించుకున్నా. అయితే క్రీడల్లో మాత్రం ఆటగాళ్ల రిటైర్మెంట్‌కు కారణం మాత్రం వారి ఇంట్లో ఉండే మహిళలే అని చెప్పగలను.  ఒక ఆటగాడికి ఫిట్‌నెస్ సమస్యలు మొదలైన తర్వాత అతడి భార్య సలహాలు ఇవ్వడం మొదలుపెడుతుంది. 

మీరు రిటైర్ అవ్వాల్సిన సమయం వచ్చిందని, కుటుంబాన్ని, పిల్లల్ని చూసుకోవాల్సిన సమయం ఆసన్నమైందంటూ చెబుతారు. కానీ నా దృష్టిలో ఒక గొప్ప అథ్లెట్ కెరీర్ విషయంలో మహిళలు తలదూర్చకూడదన్న విషయాన్ని గట్టిగా నమ్ముతాను. క్రీడాకారులకు ఫిట్‌నెస్‌తో సంబంధం లేదు. శక్తి ఉన్నంతవరకు ఆడాలన్నది నా అభిప్రాయం’ అని చెప్పుకొచ్చారు. 

అంతకముందు ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ కావాలంటూ వస్తున్న విమర్శలను యోగరాజ్ సింగ్  ఖండించారు. ధోని ఫిట్‌నెస్ స్థాయిని పరిగణలోకి తీసుకుంటే, అతడు మరో దశాబ్దం పాటు ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడని పేర్కొన్నాడు. కాగా ధోని పిక్క కండరాల గాయంతో ఐపీఎల్‌ 19వ సీజన్‌లో తొలి రెండు వారాల పాటు దూరమైనట్లు సీఎస్‌కే యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది.

చదవండి: కుర్ర క్రికెటర్లపైనే అందరి దృష్టి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement