హైదరాబాద్‌ యువ షూటర్‌ ఇషా సింగ్‌కు అభినందన...

Esha singh For Outstanding By Minister Srinivas Goud - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పెరూలో ఇటీవల జరిగిన ప్రపంచ జూనియర్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌ లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి రెండు రజత పతకాలు సాధించిన హైదరాబాద్‌ యువ షూటర్‌ ఇషా సింగ్‌ను తెలంగాణ రాష్ట్ర క్రీడల మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ అభినందించారు. తెలంగాణకు చెందిన పలువురు క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారని, షూటింగ్‌లో ఇషా భారత భవిష్యత్‌ ఆశాకిరణమని ఈ సందర్భం గా మంత్రి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ  చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌ రెడ్డి కూడా పాల్గొన్నారు.   

ఐ–లీగ్‌లో తెలుగు కుర్రాడు 
సాక్షి, హైదరాబాద్‌: దేశవాళీ ఫుట్‌బాల్‌ ఐ–లీగ్‌లో తెలుగు కుర్రాడు సునీల్‌ బథాలా అరంగేట్రం చేయనున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ఆర్‌ కడప జిల్లాకు చెందిన సునీల్‌తో ఈ లీగ్‌లో తొలిసారి బరిలోకి దిగనున్న శ్రీనిధి డెక్కన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎస్‌డీఎఫ్‌సీ) ఒప్పందం చేసుకుంది. గతంలో భారత అండర్‌–16 శిబిరంలో పాల్గొన్న సునీల్‌ 2020 డిసెంబర్‌లో ఎస్‌డీఎఫ్‌సీలో సెంటర్‌ డిఫెండర్‌గా చేరాడు. తన ఆటతీరుకు మెరు గులు దిద్దుకొని ఐ–లీగ్‌లో పాల్గొనే అవకాశాన్ని సంపాదించాడు. 13 జట్లు పాల్గొనే ఐ–లీగ్‌ డిసెంబర్‌లో మొదలయ్యే అవకాశముంది.

చదవండిKKR vs DC, IPL 2021: కోల్‌కతా ‘సిక్సర్‌’తో...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top