ఇంగ్లండ్‌ తొండాట.. మోర్గాన్‌కు సీక్రెట్‌ మెసేజ్‌లు 

Eoin Morgan Defends Use Of Signals From Team Balcony - Sakshi

కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికాతో మూడో టీ20లో భాగంగా మైదానంలో ఉన్న  ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్ మోర్గాన్‌కి డ్రెస్సింగ్‌ రూము నుంచి సందేశాలు రావడం వివాదాస్పదంగా మారింది. ఆ టీమ్ అనలిస్ట్ నాథన్ లీమన్ రహస్య సందేహాలు పంపడం వివాదస్పదమైంది. కేప్ టౌన్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భాగంగా బౌలింగ్ మార్పు, ఫీల్డింగ్ కూర్పునకి సహాయపడేలా నాథన్ బోర్డుపై 3C, 4E అంటూ స్టేడియంలో ప్రదర్శించాడు. వాటిని చూస్తూ కెప్టెన్ మోర్గాన్ తన వ్యూహాల్ని మార్చుకుంటూ వెళ్లాడు. ఈ మ్యాచ్‌లో  ఇంగ్లండ్‌ 9 వికెట్ల తేడాతో విజయం సాధించడమే కాకుండా మూడు టీ20ల సిరీస్‌ని 3-0తో చేజిక్కించుకుంది. దీన్ని మోర్గాన్‌ సమర్ధించుకుంటున్నాడు. ఇది ఎంతమాత్రం తప్పుకాదని అంటున్నాడు. ఇది కూడా గేమ్‌ స్పిరిట్‌లో భాగమేనని వాదిస్తున్నాడు. (ఫేవరెట్‌గా టీమిండియా.. టాప్‌లో కోహ్లి)

‘కెప్టెన్లగా ఉండటమంటే ఎప్పుడూ డిఫెరెంట్‌గానే ఉంటుంది. టైటిల్‌,పవర్‌ ఇలా అనేక విషయాల్ని ఎంజాయ్‌ చేస్తుంటారు. ఇలా నేను వ్యవహరించడం తప్పు ఎంతమాత్రం కాదు. ఇది ఒక సిస్టమ్‌. జట్టు ప్రయోజనాల కోసం మిగతా కెప్టెన్లు కూడా దీన్ని అనుసరించవచ్చు. దీన్ని మేము ప్రయత్నించాం. కొన్ని నిర్ణయాలను ఫీల్డ్‌లో తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఇలా ఫీడ్‌ తీసుకోవడంతో కెప్టెన్లగా మాకు లాభిస్తుంది. తొలి గేమ్‌లో ఇలా మూడు నిర్ణయాలు తీసుకుంటే, రెండో గేమ్‌లో రెండు నిర్ణయాలు తీసుకున్నాం. మూడో మ్యాచ్‌లు పలు నిర్ణయాలకు ఈ విధానాన్ని అనుసరించాం. ఇది ఎంతమాత్రం ఐసీసీ నిబంధనల్ని ఉల్లంఘించినట్లు కాదు. టీమ్‌ స్పిరిట్‌ పరిథిలోనే ఉంది’ అని మోర్గాన్‌ పేర్కొన్నాడు.(విలియమ్సన్‌ 251)

మైదానంలోని ఆటగాడికి ఇలా డ్రెస్సింగ్ రూము నుంచి సందేశాలు పంపడం ఇదేమీ కొత్త కాదు. 1999 ప్రపంచకప్‌ సందర్భంగా అప్పటి కోచ్‌ బాబ్‌ వూమర్‌.. దక్షిణాఫ్రికా కెప్టెన్‌ హాన్సీ క్రానె, పేసర్‌ అలన్‌ డొనాల్డ్‌తో ఇయర్‌ ఫోన్‌లో మాట్లాడటం తీవ్ర దుమారం రేపింది. దీంతో మైదానంలో ఎలక్ట్రానిక్‌ వస్తువుల వినియోగంపై ఐసీసీ వెంటనే నిషేధం విధించింది. 2017లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఔటైన స్టీవ్‌స్మిత్‌ని డీఆర్‌ఎస్ కోరాల్సిందిగా డ్రెస్సింగ్ రూము నుంచి సహాయ సిబ్బంది సిగ్నల్స్ ఇచ్చారు. అయితే.. కోహ్లీ ఆ విషయాన్ని పసిగట్టి.. అంపైర్లకి ఫిర్యాదు చేయడంతో అప్పట్లో పెద్ద దుమారం రేగింది. మాజీ క్రికెటర్లు, నెటిజన్లు చాలా మంది.. అనలిస్ట్ నాథన్ లీమన్ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ చర్యను ఐసీసీ తీవ్రంగా పరిగణించాలని వారు కోరుతున్నారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top