Joe Root Reverse Scoop Shot: వారెవ్వా రూట్‌! సూపర్‌ సిక్స్‌! వీడియో వైరల్‌!

ENG vs NZ 3rd Test: Joe Root Reverse Scoop Shot Stunning Six Goes Viral - Sakshi

England Vs New Zealand Test Series 2022: ఇంగ్లండ్‌ టెస్టు జట్టు మాజీ కెప్టెన్‌ జో రూట్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగిన తర్వాత అతడి బ్యాటింగ్‌ రోజురోజుకీ మెరుగుపడుతోంది. భారీ స్కోర్లు చేయడంలో రూట్‌ సఫలమవుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ఈ క్రమంలో స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో రూట్‌ బ్యాట్‌ ఝులిపిస్తున్న విధానం అతడి ఫామ్‌ను చాటుతోంది. మొదటి టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో 115 పరుగులతో అజేయంగా నిలిచిన రూట్‌.. ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

ఇక రెండో టెస్టులో 176 పరుగులతో రాణించాడు. ఇదిలా ఉంటే ఆఖరిదైన మూడో మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో తడబడ్డా.. రెండో ఇన్నింగ్స్‌లో జోరు ప్రదర్శిస్తున్నాడు రూట్‌. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 80 బంతుల్లో 55 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా 21.6వ ఓవర్‌లో అతడు ఆడిన రివర్స్‌ స్వీప్‌షాట్‌ హైలెట్‌గా నిలిచింది.

కివీస్‌ పేసర్‌ నీల్‌ వాగ్నర్‌ బౌలింగ్‌లో రూట్‌ రివర్స్‌ స్వీప్‌షాట్‌తో సిక్సర్‌ కొట్టాడు. దీంతో బిక్కమొహం వేయడం వాగ్నర్‌ వంతైంది. ఇక రూట్‌ స్టన్నింగ్‌ షాట్‌కు సంబంధించిన వీడియోను ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు ట్విటర్‌లో షేర్‌ చేయగా వైరల్‌ అవుతోంది. ఇక సిరీస్‌ విషయానికొస్తే మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌ ఇప్పటికే రెండు గెలిచి సిరీస్‌ను కైవలం చేసుకుంది.  

చదవండి: IND Vs IRE 1st T20: ‘గంటకు 208 కి.మీ. వేగం’.. వరల్డ్‌ రికార్డు బద్దలు కొట్టిన భువీ?! అక్తర్‌ ఎవరు?
IND Vs IRE- Hardik Pandya: మరీ ఇంత స్వార్థం పనికిరాదు! పాండ్యాపై నెటిజన్ల ఫైర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top