
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26 సీజన్‌కు ముందు డర్బన్ సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ ఐడైన్ మార్‌క్రమ్ ఎంపికయ్యాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా డర్బన్ సూపర్ జెయింట్స్ ప్రకటన చేసింది. గత సీజన్‌లో డర్బన్ కెప్టెన్‌గా వ్యహరించిన కేశవ్ మహారాజ్ స్ధానాన్ని మార్‌క్రమ్ భర్తీ చేయనున్నాడు. ఇటీవల జరిగిన వేలంలో మార్‌క్రమ్‌ను రూ.7 కోట్ల భారీ ధరకు డర్బన్ ఫ్రాంచైజీ దక్కించుకుంది.
ఎస్ఎ టీ20 తొట్ట తొలి సీజన్ నుంచి సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌కు ప్రాతినిథ్యం వహించిన మార్‌క్రమ్.. నాలుగో సీజన్‌కు ముందు ఆ జట్టుతో తెగదింపులు చేసుకున్నాడు. దీంతో వేలంలోకి వచ్చిన ఈ సౌతాఫ్రికా టీ20 కెప్టెన్ కోసం చాలా ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి.
రెండు సార్లు ఛాంపియన్ అయిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ సైతం అతడి సొంతం చేసుకోవాలని భావించింది. అందుకు కోసం మార్‌క్రమ్‌పై రైట్ టు మ్యాచ్ (RTM) కార్డును ఉపయోగించాలని చూసింది. కానీ డర్బన్ మాత్రం వారి పోటీగా భారీ మొత్తాన్ని పెంచుకుంటూ పోతూ మార్‌క్రమ్‌ను సొంతం చేసుకుంది.
కాగా డర్బన్ సూపర్ జెయింట్స్ జట్టు.. ఐపీఎల్‌కు చెందిన లక్నో సూపర్ జెయింట్స్ సిస్టర్ ఫ్రాంచైజీ కావడం గమనార్హం. ఐపీఎల్‌లో మార్‌క్రమ్‌కు లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే లక్నో యాజమాన్యం మార్‌క్రమ్‌కు తమ డర్బన్ జట్టు పగ్గాలను అప్పగించింది.
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో మార్‌క్రమ్‌కు అద్బుతమైన రికార్డు ఉంది. కెప్టెన్‌గా రెండు సార్లు సన్‌రైజర్స్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. డర్బన్ సూపర్ జెయింట్స్ జట్టులో హెన్రిచ్ క్లాసెన్, సునీల్ నరైన్, జోస్ బట్లర్, డెవాన్ కాన్వే వంటి సూపర్ స్టార్లు ఉన్నారు. ఈ ఎస్ఎ టీ20 నాలుగో ఎడిషన్ ఈ ఏడాది డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది. గత సీజన్ ఛాంపియన్‌గా ఎంఐ కేప్‌టౌన్ జట్టు నిలిచింది.
డర్బన్ సూపర్ జెయింట్స్ జట్టు
నూర్ అహ్మద్, హెన్రిచ్ క్లాసెన్, సునీల్ నరైన్, జోస్ బట్లర్, క్వేనా మఫాకా, ఐడెన్ మార్క్రమ్, డెవాన్ కాన్వే, గెరాల్డ్ కోయెట్జీ, డేవిడ్ బెడింగ్‌హామ్, మార్క్వెస్ అకెర్‌మాన్, ఈథన్ బాష్, ఆండిలే సిమెలానే, టోనీ డీ జోర్జి, డయాన్ గలీమ్, తైజుల్ ఇస్లాం, ఎవాన్ జోన్స్, గిస్‌బెర్ట్ వేజ్, డేవిడ్ వీస్, డారిన్ డుపావిలోన్.
Aiden Markram. That's it, that's the 𝘊𝘢𝘱𝘵𝘢𝘪𝘯💙 pic.twitter.com/fKVXYZRJc4
— Durban's Super Giants (@DurbansSG) September 13, 2025