
దులిప్ ట్రోఫీ-2025 (Duleep Trophy) సీజన్‌లో పాల్గొనే వెస్ట్‌జోన్ (West Zone) జట్టు ఖరారైంది. టీమిండియా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) ఈ దేశవాళీ టోర్నీలో వెస్ట్‌జోన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అతడి సారథ్యంలోని ఈ టీమ్‌లో టీమిండియా స్టార్లు యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, రుతురాజ్ గైక్వాడ్ కూడా భాగం కానున్నారు.
దూబే, రహానే, పుజారాలకు మొండిచేయి
వీరితో పాటు దేశీ స్టార్లు తుషార్ దేశ్‌పాండే, షామ్స్ ములానీ, తనూష్ కొటియాన్ కూడా వెస్ట్‌జోన్‌కు ఆడనున్నారు. మరోవైపు.. శివం దూబే అందుబాటులో ఉన్నా సెలక్టర్లు మాత్రం అతడిని పట్టించుకోలేదు. అదే విధంగా.. టీమిండియా వెటరన్ బ్యాటర్లు అజింక్య రహానే, ఛతేశ్వర్ పుజారాలకు కూడా దులిప్ ట్రోఫీ జట్టులో చోటు దక్కలేదు.
రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌లో శార్దూల్ ఠాకూర్ అదరగొట్టిన విషయం తెలిసిందే. ముంబైకి ప్రాతినిథ్యం వహించిన ఈ ఆల్‌రౌండర్ లోయర్ ఆర్డర్‌లో భారీగా పరుగులు రాబట్టడంతో పాటు.. కీలక సమయాల్లో వికెట్లు తీసి సత్తా చాటాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ ఆడుతున్న టీమిండియాలో శార్దూల్ సభ్యుడిగా ఉన్నాడు.
ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో శార్దూల్ పెద్దగా రాణించడం లేదు. మరోవైపు.. వెస్ట్‌జోన్ జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వస్తాడనుకుంటే.. ఆసియా టీ20 కప్-2025తో అతడు బిజీ కానున్న నేపథ్యంలో పక్కనపెట్టినట్లు తెలుస్తోంది.
మరోవైపు సౌత్ జోన్ కెప్టెన్‌గా టీమిండియా స్టార్ తిలక్ వర్మ ఎంపికయ్యాడు. కాగా ఆగష్టు 28- సెప్టెంబరు 15 వరకు దులిప్ ట్రోఫీ-2025 నాకౌట్ మ్యాచ్‌ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారు చేశారు.
దులిప్ ట్రోఫీ-2025లో తలపడే వెస్ట్‌జోన్ జట్టు
శార్దూల్ ఠాకూర్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, ఆర్య దేశాయ్, హార్విక్ దేశాయ్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, రుతురాజ్ గైక్వాడ్, జైమీత్ పటేల్, మనన్ హింగ్‌రాజియా, సౌరభ్ నవలే (వికెట్ కీపర్), షమ్స్ ములానీ, తనుష్ కొటియాన్, ధర్మేంద్ర జడేజా, తుషార్ దేశ్‌పాండే, అర్జాన్ నాగ్వాస్వలా.
సౌత్ జోన్ జట్టు
తిలక్ వర్మ (కెప్టెన్), మొహమ్మద్ అజహరుద్దీన్, తన్మయ్ అగర్వాల్, దేవదత్ పడిక్కల్, మోహిత్ కాలె, సల్మాన్ నిజార్, నారాయణ్ జగదీశన్, త్రిపురాణ విజయ్, సాయి కిషోర్, తనయ్ త్యాగరాజన్, వైశాఖ్ విజయ్ కుమార్, ఎండీ ని«దీశ్, రికీ భుయ్, బాసిల్, గుర్జపనీత్ సింగ్, స్నేహల్ కౌథాంకర్. స్టాండ్‌బై: మోహిత్ రెడ్కర్, స్మరణ్, అంకిత్ శర్మ, యాపిల్ టామ్, సిద్ధార్థ్, షేక్ రషీద్
దులిప్ ట్రోఫీ-2025 షెడ్యూల్
👉ఆగష్టు 28- 31: తొలి క్వార్టర్ ఫైనల్- నార్త్ జోన్ వర్సెస్ ఈస్ట్ జోన్
👉ఆగష్టు 28- 31: రెండో క్వార్టర్ ఫైనల్- సెంట్రల్ జోన్ వర్సెస్ నార్త్ ఈస్ట్ జోన్
👉సౌత్ జోన్ (తొలి సెమీస్), వెస్ట్ జోన్ (రెండో సెమీస్) ఇప్పటికే సెమీ ఫైనల్ చేరగా.. సెప్టెంబరు 4-7 వరకు సెమీస్ మ్యాచ్‌లు జరుగుతాయి
👉సెప్టెంబరు 11- 15: ఫైనల్.
చదవండి: IND vs ENG: నా కుమారుడు చేసిన తప్పేంటి?: సెలక్టర్లపై క్రికెటర్ తండ్రి ఫైర్