Novak Djokovic: కోవిడ్‌కు విరుగుడు కనిపెట్టే పనిలో జకోవిచ్‌..!

Djokovic Holds Major Stake In Firm Developing Covid Drug Reveals CEO - Sakshi

Djokovic Holds Major Stake In Firm Developing Covid Drug: వ్యాక్సిన్‌ వేసుకోని కారణంగా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పాల్గొనకుండా గెంటి వేయబడ్డ ప్రపంచ నంబర్‌ వన్‌ టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌.. ఔషధ తయారీ రంగంలోకి అడుగుపెట్టాడని తెలుస్తోంది. అతడికి కోవిడ్‌ విరుగుడు మందు తయారు చేసే సంస్థలో భారీ వాటా ఉన్నట్లు.. సదరు కంపెనీ సీఈఓనే స్వయంగా వెల్లడించాడు. డానిష్‌కు చెందిన క్వాంట్‌ బయోరెస్‌ అనే కోవిడ్‌ ఔషధ తయారీ సంస్థలో జకో, అతని భార్యకు 80 శాతం వాటా ఉన్నట్లు సంస్థ సీఈఓ ఇవాన్‌ తెలిపాడు.

త్వరలో తమ ఔషధంతో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నాడు. అయితే, ఈ వార్తలపై జకోవిచ్‌ స్పందించాల్సి ఉంది. కాగా, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఆడేందకు అనుమతి లభించక పోవడంతో.. 21వ గ్రాండ్‌స్లామ్‌ గెలిచే అవకాశాన్ని జకోవిచ్‌ చేజార్చుకున్నాడు. మరోవైపు అతను వ్యాక్సిన్‌ వేసుకోకపోతే ఫ్రెంచ్‌ ఓపెన్‌లో కూడా అడనిచ్చేది లేదని ఫ్రెంచ్‌ అధికారులు సైతం స్పష్టం చేశారు. దీంతో జకో వ్యాక్సిన్‌ వేసుకుంటాడా లేదా అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకింది.   
చదవండి: ప్రిక్వార్టర్స్‌లో సింధు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top