ఘనంగా దీపక్‌ చాహర్‌ లవ్‌ ప్రపోజల్‌ సెలబ్రేషన్స్‌.. ధోని, రైనా హంగామా చూడండి

Deepak Chahar CSK Teammates Did This After He Proposed To Girl Friend - Sakshi

Deepak Chahar Love Proposal Celebrations: చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆటగాడు దీపక్‌ చాహర్‌.. గురువారం పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌ అనంతరం తన నెచ్చెలి జయా భరద్వాజ్‌కు లైవ్‌లో ప్రేమను వ్యక్తపరిచిన విషయం తెలిసిందే. అనంతరం సీఎస్‌కే యాజమాన్యం ఈ లవ్‌ జంట కోసం అదిరిపోయే పార్టీని అరేంజ్‌ చేసింది. తొలుత వీరిరువురు కేక్‌ను కట్‌ చేసి ఒకరికొకరు తినిపించుకోగా.. ఆ తర్వాత అసలు సిసలైన సెలబ్రేషన్స్‌ స్టార్ట్‌ అయ్యాయి. ధోని నేతృత్వంలో రైనా, జడేజా, శార్ధూల్‌ ఠాకూర్‌, రాబిన్‌ ఊతప్పలు చాహర్‌ను కేక్‌, డ్రింక్స్‌తో ముంచెత్తారు. ఈ వేడుకల్లో ధోని, రైనాల కూతుళ్లు తెగ సందడి చేయగా, ధోని భార్య సాక్షి.. జయా భరద్వాజ్‌ను హత్తుకుని విష్‌ చేసింది. 

ఈ వేడుకకు సంబంధించిన వీడియోను చెన్నై సూపర్‌ కింగ్స్‌ యాజమాన్యం తమ అధికారిక ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయగా వైరలవుతోంది. జోడి బాగుంది అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే, సీఎస్‌కే జట్టు నిన్నటి మ్యాచ్‌లో పంజాబ్‌ చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ విధ్వంసం ధాటికి సీఎస్‌కే 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. అయితే, చెన్నైకు ఇదివరకే ఫ్లే ఆఫ్స్‌ బెర్తు ఖరారు కావడంతో మ్యాచ్‌ నామమాత్రంగా సాగింది. 13 మ్యాచ్‌ల్లో 13 వికెట్లతో దీపక్‌ చాహర్‌ సీఎస్‌కే విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు.  
చదవండి: Deepak Chahar: మరదలు దొరికేసింది.. ఇంతకీ ఎవరీ అమ్మాయి?!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top