IPL 2023: ఐపీఎల్‌కు పంత్‌ దూరం.. ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా అతడే?

David Warner set to lead Delhi Capitals in his absence Ipl 2023 - Sakshi

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌ కారు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పంత్‌ రిషికేష్ లోని ఏయిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు. పంత్‌ పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 6 నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు స్వదేశంలో ఆస్ట్రేలియా సిరీస్ తో పాటు ఐపీఎల్ కూడా దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఒక వేళ పంత్‌ ఐపీఎల్‌కు దూరమైతే ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు పగ్గాలు ఎవరు చేపడతారన్నది అందరి మొదడలను తొలుస్తున్న ప్రశ్న. అయితే ఐపీఎల్‌ సమయానికి పంత్‌ కోలుకో లేనట్లయితే ఢిల్లీ జట్టు సారథ్య బాధ్యతలు ఆస్ట్రేలియా స్టార్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ చేపట్టే అవకాశం ఉంది.

ఎందుకంటే ప్రస్తుత ఢిల్లీ జట్టులో వార్నర్‌ అంత అనుభవం ఉన్న ఆటగాడు ఎవరూ లేరు. అదే విధంగా గతంలో ఐపీఎల్‌లో కెప్టెన్‌గా పని చేసిన అనుభవం కూడా వార్నర్‌కు ఉంది. దాదాపు ఐదు ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా వార్నర్‌ పనిచేశాడు. దీంతో వార్నర్‌ వైపే  ఢిల్లీ క్యాపిటల్స్‌ మెనేజ్‌మెంట్‌ మొగ్గు చూపే అవకాశం ఉంది.

ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు: రిషబ్ పంత్ (కెప్టెన్‌), డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, రిపాల్ పటేల్, రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, యశ్ ధుల్, మిచెల్ మార్ష్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అన్రిచ్ నార్ట్జే, చేతన్ సకారియా, కమలేష్ నాగర్‌కోటి, ఖలీల్ అహ్మద్, లుంగి ఎంగిడీ, ముస్తిఫిజర్‌ రెహమాన్, అమన్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్, ఇషాంత్ శర్మ, ఫిల్ సాల్ట్, ముఖేష్ కుమార్, మనీష్ పాండే, రిలీ రోసోవ్.
చదవండి: Rishabh Pant: నిలకడగా రిషబ్‌ పంత్‌ ఆరోగ్యం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top