
Urbanrisers Hyderabad vs Manipal Tigers: మిచౌంగ్ తుపాను ప్రభావం లెజెండ్స్ లీగ్ క్రికెట్ మ్యాచ్‌పై పడింది. విశాఖపట్నంలో సోమవారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఈ విషయాన్ని నిర్వాహకులు వెల్లడించారు. కాగా లెజెండ్స్ టీ20 లీగ్ తాజా సీజన్‌లో భాగంగా విశాఖలో మూడు మ్యాచ్‌ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.
ఇందులో భాగంగా పీఎం పాలెంలో ఉన్న డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరిగింది. డిసెంబరు 2న ఇండియా క్యాపిటల్స్- మణిపాల్ టైగర్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో గౌతం గంభీర్ ఇండియా క్యాపిటల్స్ సేన.. హర్భజన్ సింగ్ సారథ్యంలోని మణిపాల్ చేతిలో ఓడిపోయింది.
ఇక డిసెంబరు 3 నాటి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్- సదరన్ సూపర్ స్టార్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ క్రమంలో నగరంలో ఆఖరిదైన మ్యాచ్ అర్బన్ రైజర్స్ హైదరాబాద్- మణిపాల్ టైగర్స్ మధ్య సోమవారం సాయంత్రం జరగాల్సి ఉంది. అయితే, తుపాను మిచౌంగ్ కారణంగా వర్షం తెరిపినివ్వకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు.
ఇక ఈ టోర్నమెంట్‌లో భాగంగా తదుపరి మ్యాచ్‌లు ఆడేందుకు క్వాలిఫై అయిన గుజరాత్ జెయింట్స్, మణిపాల్ టైగర్స్, అర్బన్ రైజర్స్ హైదరాబాద్, ఇండియా క్యాపిటల్ జట్లు సూరత్‌కు బయలుదేరి వెళ్లనున్నాయి.
చదవండి: భారత్‌కు తిరిగి వచ్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. వీడియో వైరల్