జట్టుకు చెడ్డపేరు వస్తోంది.. చర్యలు తీసుకుంటాం: సంగక్కర | Kumar Sangakkara Expresses Concern Over Off-Field Controversies In Rajasthan Royals Camp In IPL Campaign, More Details Inside | Sakshi
Sakshi News home page

జట్టుకు చెడ్డపేరు వస్తోంది.. చర్యలు తీసుకుంటాం: సంగక్కర

May 2 2026 9:25 AM | Updated on May 2 2026 10:35 AM

Controversies not a positive reflection of the team: Kumar Sangakkara

రాజస్తాన్‌ రాయల్స్‌కు సంబంధించి ఈ ఐపీఎల్‌లో బయటికొచ్చిన‌ వివాదాలపై టీమ్‌ హెడ్‌ కోచ్‌ కుమార్‌ సంగక్కర స్పందించాడు. ఇవి జట్టుకు చెడ్డ పేరు తెస్తున్నాయని అతను అభిప్రాయపడ్డాడు. టీమ్‌ కెపె్టన్‌ రియాన్‌ పరాగ్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌లో ‘వేపింగ్‌’ చేస్తూ పట్టుబడగా, కొద్ది రోజుల క్రితమే టీమ్‌ మేనేజర్‌ రోమి భిందర్‌ డగౌట్‌లో ఫోన్‌ వాడుతూ కనిపించాడు. 

ఈ రెండు ఘటనలపై బీసీసీఐ చర్య తీసుకుంటూ జరిమానాలు విధించింది. "ఏ రకమైన వివాదమైనా జట్టుపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఈ రెండింటిపై బీసీసీఐ చర్య తీసుకుంది. మా జట్టులో మంచి విలువలు, సంస్కృతి ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. మీరు చేసే ఏ పనైనా ఫ్రాంచైజీకి చెడ్డ పేరు తెస్తుంది కాబట్టి బాధ్యతగా ఉండమని ఆటగాళ్లకు చెబుతున్నాం" అని సంగక్కర వ్యాఖ్యానించాడు.

కాగా శు​‍క్రవారం జైపూర్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో రాజస్తాన్‌ ఓటమి పాలైంది. రాజస్తాన్‌కు ఇది నాలుగో ఓటమి. రాయల్స్‌ జట్టు ప్రస్తుతం  పాయింట్ల పట్టికలో నాలుగో స్ధానంలో ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement