
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రీడల్లో భారత్‌ను మరింత ఉన్నత స్థితికి చేర్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త క్రీడా విధానానికి ఆమోద ముద్ర పడింది. ‘ఖేలో భారత్ నీతి’ పేరుతో తయారు చేసిన ఈ పాలసీని తాజా కేబినెట్ సమావేశంలో ఆమోదించారు. క్రీడల్లో ప్రపంచ టాప్–5లో నిలిచేందుకు అవసరమైన రోడ్ మ్యాప్‌తో ఇది సిద్ధమైందని ప్రభుత్వం ప్రకటించింది. భారత్‌లో తొలిసారి 1984లో క్రీడా పాలసీ అమల్లోకి వచి్చంది. ఆ తర్వాత 2001లో దీనికి మార్పులు చేశారు.
అప్పటి నుంచి అదే విధానం కొనసాగుతుండగా.. 2001లో పాలసీని సవరిస్తూ కొత్త అంశాలు చేర్చారు. విశ్వ వేదికపై చక్కటి ప్రదర్శన, ఆరి్థకాభివృద్ధికి క్రీడలు, సామాజిక వృద్ధికి క్రీడలు, ప్రజల్లో క్రీడల ద్వారా చైతన్యం, జాతీయ విద్యావిధానంతో కలిసి క్రీడాభివృద్ధి అనే ఐదు అంశాలతో ‘ఖేలో భారత్ నీతి’ని ముందుకు తీసుకొచ్చామని, ఇది కొత్త మార్పుకు శ్రీకారం అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.
మరోవైపు భారత సంతతికి చెంది విదేశాల్లో స్థిరపడిన ఆటగాళ్లు కూడా ఇకపై భారత్‌కు ప్రాతినిధ్యం వహించేందుకు మార్గం సుగమమైంది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం భారతీయ పాస్‌పోర్ట్ ఉన్నవారే దేశం తరఫున ఆడేందుకు అవకాశం ఉంది. భారత ఆటగాళ్లకే ఎక్కువ అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో 2008లో ఈ నిబంధనను తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో విదేశాల్లో ఉంటున్న ఏ ప్లేయర్ అయినా భారత్ తరఫున ఆడితే అతనికి వ్యక్తిగతంగా ఉపకరించడంతో పాటు ఇక్కడి వర్ధమాన, యువ ఆటగాళ్లకు కూడా సరైన మార్గనిర్దేశనం లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం భావించింది.
ఇకపై విదేశాల్లో స్థిరపడినా, అక్కడే శిక్షణ పొందుతున్నా... టోరీ్నల్లో మాత్రం మన దేశం తరఫున బరిలోకి దిగవచ్చు. ఉదాహరణకు టెన్నిస్‌లో దిగ్గజ ఆటగాడు ఆనంద్ అమృత్‌రాజ్ కుమారుడు ప్రకాశ్ అమృత్‌రాజ్‌కు అమెరికా పౌరసత్వం ఉంది. అతను 2003–08 మధ్య డేవిస్‌కప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించినా ... ఆ తర్వాత తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అతను మళ్లీ సొంత దేశం తరఫున ఆడేందుకు అవకాశం ఉంది.