
22 ఏళ్ల ప్రియజిత్ ఘోష్‌కు క్రికెట్ అంటే పిచ్చి. తన చిన్నతనం నుంచే క్రికెటర్ కావాలని కలలు కనేవాడు. తొలుత బెంగాల్‌కు ఆపై టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాలన్నదే అతడి చిరకాల స్వప్నం. కానీ తానొకటి తలిస్తే.. విధి ఒకటి తలిచింది.
క్రికెటర్‌గా ఎదగాలనకున్న అతడు హఠాత్తుగా గుండెపోటు (Heart Attack)తో తనువు చాలించాడు. వెస్ట్‌బెంగాల్‌లోని బోల్పూర్‌కు చెందిన ప్రియజిత్ ఘోష్ శుక్రవారం జిమ్‌లో వర్కవుట్లు చేస్తుండగా గుండెపోటుకు గురయ్యాడు. దాంతో అతడు ఉన్న చోటనే కుప్పకూలిపోయాడు. వెంటనే అతడికి సీపీఆర్ చేసి అస్పత్రికి తరలించినప్పటి ఫలితం మాత్రం లేకపోయింది. అతడి మరణ వార్తను బెంగాల్ ప్రో టీ20 లీగ్ ధ్రువీకరించింది.
"ప్రియజిత్.. మమ్మల్ని విడిచిపెట్టి ఇంత త్వరగా వెళ్లిపోతావు అనుకోలేదు. నీవు మాతో బౌతికంగా లేనప్పటికి, నీ జ్ణపకాలు మాతో ఎప్పటికి ఉంటాయి. ప్రియజిత్ ఘోష్ అకాల మరణానికి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాము. అతడి ఆత్మకు శాంతి చేకూరాలి" బెంగాల్ ప్రోటీ20 యాజమాన్యం ఎక్స్‌లో రాసుకొచ్చింది.
కాగా ప్రియజిత్ ఇంకా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేయినప్పటికి అండర్-14, 16లో సత్తాచాటాడు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్-16 ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. కాగా ప్రియజిత్ టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లికి వీరాభిమాని.
కోహ్లిలా ఫిట్‌గా ఉండాలని ఈ యువ క్రికెటర్ ఎక్కువ సమయం జిమ్‌లో గడిపేవాడు. ఇప్పుడు అదే జిమ్‌లో తన ప్రాణాలను కోల్పోయాడు.అతడు ఆకస్మిక మరణం సహచరులు, కోచ్‌లను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కాగా ఈ మధ్య కాలంలో యువ అథ్లెట్లు ఎక్కువగా గుండెపోటుకు గురువతున్నారు.
చదవండి: IND vs ENG: టీమిండియాతో ఐదో టెస్టు.. 123 ఏళ్ల చరిత్రను ఇంగ్లండ్ తిరగరాస్తుందా?