
ఆసియాకప్-2023ను పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఘనంగా ఆరంభించాడు. బుధవారం(ఆగస్టు 30) నేపాల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో బాబర్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 131 బంతులు ఎదుర్కొన్న బాబర్.. 14 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 151 పరుగులు చేశాడు. తద్వారా ఆసియాకప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన కెప్టెన్‌గా ఆజం రికార్డులకెక్కాడు.
బాబర్ ఆజంకు కారు గిఫ్ట్..
ఇక ఇది ఇలా ఉండగా.. ఆసియాకప్ ప్రారంభానికి ముందు బాబర్ ఆజంకు తమ కుటంబ సభ్యులు ఖరీదైన ఆడీ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. రూ. 8 కోట్ల ఖరీదు చేసే ఆడి ఇ-ట్రాన్ జిటి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును బహుమతిగా ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఫైసల్ ఆజం అనే యూట్యూబర్ షేర్ చేశాడు. బాబర్ కారును చూసి చాలా బాగుంది అని నవ్వుతూ మాట్లాడం ఈ వీడియోలో కన్పించింది.
దాయాదుల పోరు..
నేపాల్‌పై ఘన విజయం సాధించిన పాకిస్తాన్ తమ తదపరి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి భారత్‌తో తలపడేందుకు సిద్దమవుతోంది. శనివారం(సెప్టెంబర్2)న కాండీ వేదికగా భారత్-పాక్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఇప్పటికే ఇరు జట్లు కూడా శ్రీలంకకు చేరుకున్నాయి. ఈ మ్యాచ్ సాయంత్రం 3 గంటలకు ప్రారంభం కానుంది.
చదవండి: Asia Cup 2023: చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ప్రపంచంలోనే తొలి జట్టుగా! భారత్‌కు కూడా సాధ్యం కాలేదు
Babar Azam's family gifted Audi e-tron GT worth 8.1 crore to Babar Azam ❤️#BabarAzam #PakvNep #AsiaCup pic.twitter.com/1WrNGAHrmd
— Muhammad Noman (@nomanedits) August 29, 2023