అత్యంత అరుదైన క్లబ్‌లో అక్షర్‌ పటేల్‌ | Axar Patel joins an elite IPL club of players with 2000+ runs, 100+ wickets, and 100+ sixes in IPL history | Sakshi
Sakshi News home page

అత్యంత అరుదైన క్లబ్‌లో అక్షర్‌ పటేల్‌

May 25 2026 6:57 PM | Updated on May 25 2026 8:08 PM

Axar Patel joins an elite IPL club of players with 2000+ runs, 100+ wickets, and 100+ sixes in IPL history

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ సాధించలేకపోయింది. లీగ్‌ దశ చివరి వరకు రేసులో ఉన్నా, పంజాబ్‌ కింగ్స్‌ ఈ జట్టు ప్లే ఆఫ్స్‌ ఆశలపై నీళ్లు చల్లింది. అక్షర్‌ పటేల్‌ నేతృత్వంలో ఢిల్లీ ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడి 7 విజయాలు, 7 పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది.

ఢిల్లీని ప్లే ఆఫ్స్‌కు చేర్చలేకపోయినా, కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ వ్యక్తిగతంగా ఓ భారీ మైలురాయిని తాకాడు. ఐపీఎల్‌లో అత్యంత అరుదైన 2000+ పరుగులు, 100+ వికెట్లు, 100+ సిక్సర్ల క్లబ్‌లో చేరాడు. అక్షర్‌కు ముందు రాజస్థాన్‌ రాయల్స్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (3469 పరుగులు, 178 వికెట్లు, 121 సిక్సర్లు), కేకేఆర్‌ మాజీ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ (2653, 123, 223) మాత్రమే ఈ అరుదైన ట్రిపుల్‌ ఫీట్‌ను సాధించారు.

కేకేఆర్‌తో జరిగిన చివరి లీగ్‌ దశలో మ్యాచ్‌లో అక్షర్‌ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 2 సిక్సర్లు బాదడంతో అతడి సిక్సర్ల సంఖ్య 100కు చేరింది. దీంతో అతడు జడేజా, రసెల్‌ సరసన చేరాడు.

ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో (బ్యాటంగ్‌లో 39 పరుగులు, బౌలింగ్‌లో ఓ వికెట్‌, ఫీల్డింగ్‌లో 2 క్యాచ్‌లు) సత్తా చాటిన అక్షర్‌ తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌ గెలిచినా ఢిల్లీకి ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఎందుకంటే నిన్ననే ఈ జట్టు ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది (లక్నోపై పంజాబ్‌ గెలుపుతో).

ఈ సీజన్‌లో ఆర్సీబీ, గుజరాత్‌, ఎస్‌ఆర్‌హెచ్‌, రాజస్థాన్‌ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. రేపు (మే 26) జరుగబోయే తొలి క్వాలిఫయర్‌లో ఆర్సీబీ, గుజరాత్‌ తలపడనుండగా.. 27న జరుగబోయే ఎలిమినేటర్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌, రాజస్థాన్‌ అమీతుమీ తేల్చుకుంటాయి.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement