ఆసియా కప్‌-2025: పూర్తి షెడ్యూల్‌, అన్ని జట్లు, లైవ్‌ స్ట్రీమింగ్‌ వివరాలు | Asia Cup 2025 Full Schedule, Teams, Match Timings & Live Streaming Details | Sakshi
Sakshi News home page

ఆసియా కప్‌-2025: పూర్తి షెడ్యూల్‌, అన్ని జట్లు, లైవ్‌ స్ట్రీమింగ్‌ వివరాలు

Sep 8 2025 6:19 PM | Updated on Sep 8 2025 7:16 PM

Asia Cup 2025: Full Schedule All Squads Live Streaming Details Check All

ఖండాంతర క్రికెట్‌ టోర్నమెంట్‌ ఆసియా కప్‌ (Asia Cup). ఈసారి పొట్టి ఫార్మాట్లో జరిగే ఈ ఈవెంట్లో ఎనిమిది జట్లు భాగంగా ఉన్నాయి. డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో టీమిండియా (2023 వన్డే ఫార్మాట్‌ విజేత) బరిలోకి దిగుతుండగా.. శ్రీలంక, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గనిస్తాన్‌, ఒమన్‌, యూఏఈ, హాంకాంగ్‌ కూడా పాల్గొంటున్నాయి.

ఈ టోర్నీ ఆతిథ్య హక్కులు భారత్‌వే అయినా.. పాక్‌ కూడా ఈ ఈవెంట్లో భాగమైనందున తటస్థ వేదికైన యూఏఈలో మ్యాచ్‌లు నిర్వహిస్తారు. మరి.. ఆసియా కప్‌-2025 టోర్నీ పూర్తి షెడ్యూల్‌, అన్ని జట్లు, మ్యాచ్‌ ఆరంభ సమయం, ప్రత్యక్ష ప్రసారం తదితర వివరాలు తెలుసుకుందామా!!

గ్రూపులు- రెండు
గ్రూప్‌-‘ఎ’- భారత్‌, పాకిస్తాన్‌, యూఏఈ, ఒమన్‌
గ్రూప్‌-‘బి’- శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గనిస్తాన్‌, హాంకాంగ్‌

పూర్తి షెడ్యూల్‌, మ్యాచ్‌ ఆరంభ సమయం
👉సెప్టెంబరు 9: అఫ్గనిస్తాన్‌ వర్సెస్‌ హాంగ్‌కాంగ్‌- అబుదాబి- రాత్రి ఎనిమిది గంటలకు
👉సెప్టెంబరు 10: ఇండియా వర్సెస్‌ యూఏఈ- దుబాయ్‌- రాత్రి ఎనిమిది గంటలకు 
👉సెప్టెంబరు 11: బంగ్లాదేశ్‌ వర్సెస్‌ హాంగ్‌కాంగ్‌- అబుదాబి- రాత్రి ఎనిమిది గంటలకు
👉సెప్టెంబరు 12: పాకిస్తాన్‌ వర్సెస్‌ ఒమన్‌- దుబాయ్‌- రాత్రి ఎనిమిది గంటలకు
👉సెప్టెంబరు 13: బంగ్లాదేశ్‌ వర్సెస్‌ శ్రీలంక- అబుదాబి- రాత్రి ఎనిమిది గంటలకు
👉సెప్టెంబరు 14: ఇండియా వర్సెస్‌ పాకిస్తాన్‌- దుబాయ్‌- రాత్రి ఎనిమిది గంటలకు
👉సెప్టెంబరు 15: యూఏఈ వర్సెస్‌ ఒమన్‌- అబుదాబి- సాయంత్రం 5.30 నిమిషాలకు
👉సెప్టెంబరు 15:శ్రీలంక వర్సెస్‌ హాంగ్‌కాంగ్‌- దుబాయ్‌- రాత్రి ఎనిమిది గంటలకు
👉సెప్టెంబరు 17: పాకిస్తాన్‌ వర్సెస్‌ యూఏఈ- దుబాయ్‌- రాత్రి ఎనిమిది గంటలకు
👉సెప్టెంబరు 18: శ్రీలంక వర్సెస్‌ అఫ్గనిస్తాన్‌- అబుదాబి- రాత్రి ఎనిమిది గంటలకు
👉సెప్టెంబరు 19: ఇండియా వర్సెస్‌ ఒమన్‌- అబుదాబి- రాత్రి ఎనిమిది గంటలకు

👉సెప్టెంబరు 20: గ్రూప్‌- బి టాపర్‌ వర్సెస్‌ రెండో స్థానంలో ఉన్న జట్టు (B1 Vs B2)- దుబాయ్‌- రాత్రి ఎనిమిది గంటలకు
👉సెప్టెంబరు 21: గ్రూప్‌-ఎ టాపర్‌ వర్సెస్‌ రెండో స్థానంలో ఉన్న జట్టు (A1 vs A2)- దుబాయ్‌- రాత్రి ఎనిమిది గంటలకు
👉సెప్టెంబరు 23: A2 vs B1- దుబాయ్‌- రాత్రి ఎనిమిది గంటలకు
👉సెప్టెంబరు 24: A1 vs B2- దుబాయ్‌- రాత్రి ఎనిమిది గంటలకు
👉సెప్టెంబరు 25: A2 vs B2- దుబాయ్‌- రాత్రి ఎనిమిది గంటలకు
👉సెప్టెంబరు 26: A1 vs B1- దుబాయ్‌- రాత్రి ఎనిమిది గంటలకు
👉సెప్టెంబరు 28: ఫైనల్‌- దుబాయ్‌- రాత్రి ఎనిమిది గంటలకు.

జట్లు ఇవే
టీమిండియా
సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్ (వైస్‌ కెప్టెన్‌), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్‌ కీపర్‌), జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్‌ కీపర్‌), హర్షిత్ రాణా, రింకూ సింగ్‌.
రిజర్వు ప్లేయర్లు: ప్రసిద్‌ కృష్ణ, వాషింగ్టన్‌ సుందర్‌, రియాన్‌ పరాగ్‌, ధ్రువ్‌ జురెల్‌, యశస్వి జైస్వాల్‌.

పాకిస్తాన్‌
సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్ (వికెట్-కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీమ్ జూనియర్, సాహిబ్‌జాదా ఫర్హాన్‌, సయీమ్‌ అయూబ్‌, సల్మాన్‌ మీర్జా, షాహిన్‌ అఫ్రిది, సూఫియాన్‌ మొకిమ్

యూఏఈ
ముహమ్మద్‌ వసీం (కెప్టెన్‌), అలిశాన్‌ షరాఫూ, ఆర్యాంశ్‌ శర్మ (వికెట్‌ కీపర్‌), ఆసిఫ్‌ ఖాన్‌, ధ్రువ్‌ పరాశర్‌, ఈథన్‌ డిసౌజా, హైదర్‌ అలీ, హర్షిత్‌ కౌశిక్‌, జునైద్‌ సిద్దిఖీ, మతీఉల్లా ఖాన్‌, ముహమ్మద్‌ ఫారూక్‌, ముహమ్మద్‌ జవాదుల్లా, ముహమ్మద్‌ జోహైబ్‌, రాహుల్‌ చోప్రా (వికెట్‌ కీపర్‌), రోహిద్‌ ఖాన్‌, సిమ్రన్‌జీత్‌ సింగ్‌, సాఘిర్‌ ఖాన్‌.

ఒమన్‌
జతీందర్ సింగ్ (కెప్టెన్‌), హమ్మద్ మీర్జా, వినాయక్ శుక్లా, సూఫియాన్‌ యూసుఫ్, ఆశిష్ ఒడెదెరా, అమీర్ కలీమ్, మహ్మద్ నదీమ్, సూఫియాన్‌ మెహమూద్, ఆర్యన్ బిష్త్, కరణ్ సోనావాలే, జిక్రియా ఇస్లాం, హస్నైన్ అలీ షా, ఫైసల్ షా, మహమ్మద్ ఇమ్రాన్, షకీల్‌ అహ్మద్‌, సమయ్‌ శ్రీవాస్తవ.

శ్రీలంక
చరిత్ అసలంక (కెప్టెన్‌), కుశాల్ మెండిస్ (వికెట్‌కీపర్‌), పాతుమ్‌ నిస్సాంక, కుశాల్ పెరీరా, కమిల్ మిషార, దసున్ షనక, కమిందు మెండిస్, వనిందు హసరంగ, నువానీదు ఫెర్నాండో, దునిత్ వెల్లాలగే, చమిక కరుణరత్నే, మహీశ్‌ తీక్షణ, మతీశ పతిరణ, నువాన్‌ తుషార, దుష్మంత చమీరా, బినుర ఫెర్నాండో.

బంగ్లాదేశ్‌
లిట్టన్ కుమార్ దాస్ (కెప్టెన్), తాంజిద్ హసన్, పర్వేజ్ హొస్సేన్ ఇమాన్‌, సైఫ్ హసన్, తౌహిద్ హ్రిదోయ్, జాకర్ అలీ అనిక్, షమీమ్ హొస్సేన్, క్వాజీ నూరుల్ హసన్ సోహన్, షాక్ మహేదీ హసన్, రిషద్ హుస్సేన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌, తాంజిమ్‌ హసన్‌ సకీబ్‌, టస్కిన్‌ అహ్మద్‌, షరీఫుల్‌ ఇస్లాం, షైఫ్‌ ఉద్దీన్‌
స్టాండ్‌బై ప్లేయర్లు: సౌమ్య సర్కార్‌, మెహిదీ హసన్‌ మిరాజ్‌, తన్వీర్‌ ఇస్లాం, హసన్‌ మహమూద్‌.

అఫ్గనిస్తాన్‌
రషీద్ ఖాన్ (కెప్టెన్‌), రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, దర్విష్ రసూలీ, సెదిఖుల్లా అటల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కరీం జనత్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, షరాఫుద్దీన్ అష్రఫ్, మహ్మద్ ఇషాక్, ముజీబ్ ఉర్ రహమాన్, అల్లాహ్ గజన్ఫార్. నూర్ అహ్మద్, ఫారిక్ అహ్మద్ మాలిక్, నవీన్-ఉల్-హక్, ఫజల్హాక్ ఫరూకీ
రిజర్వ్ ఆట‌గాళ్లు: వఫివుల్లా తారఖాల్, నంగ్యాల్ ఖరోటే, అబ్దుల్లా అహ్మద్‌జాయ్

హాంకాంగ్‌
యాసిమ్ ముర్తాజా (కెప్టెన్‌), బాబర్ హయత్, ఆదిల్ మెహమూద్, జీషన్ అలీ (వికెట్‌ కీపర్‌), ఎహ్సాన్ ఖాన్, అనాస్ ఖాన్, షాహిద్ వాసిఫ్ (వికెట్‌ కీపర్‌), కల్హన్ చల్లు, హరూన్ అర్షద్, నిజకత్ ఖాన్, ఆయుశ్‌ శుక్లా, అలీ హసన్, నస్రుల్లా రానా, ఐజాజ్ ఖాన్, ఎండీ ఘజన్‌ఫర్‌, మార్టిన్‌ కోయెట్జి, అతీక్‌ ఇక్బాల్‌, మహ్మద్‌ వాహిద్‌, అన్షుమన్‌ రథ్‌, కించిత్‌ షా.

ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే..
ఆసియా కప్‌-2025 టీ20 మ్యాచ్‌లను సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌ (టీవీ)లో వీక్షించవచ్చు. డిజిటల్‌ యూజర్ల కోసం సోనీలివ్‌ వెబ్‌సైట్‌, మొబైల్‌ అప్లికేషన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

ప్రైజ్ మ‌నీ ఎంతంతంటే?
ఆసియాక‌ప్-2022(టీ20 ఫార్మాట్‌) ఛాంపియ‌న్స్‌గా నిలిచిన శ్రీలంకకు దాదాపు 200,000 డాల‌ర్ల‌( సుమారు రూ. 1.6 కోట్లు) ప్రైజ్‌మ‌నీ ల‌భించింది. ఈ ఏడాది ఆసియా విజేత‌గా నిలిచే జ‌ట్టుకు 300,000 డాల‌ర్లు (దాదాపు రూ. 2.6 కోట్లు) న‌గ‌దు బ‌హుమ‌తి ఏసీసీ అంద‌జేయ‌నున్న‌ట్లు సమాచారం.  గ‌త ఎడిషన్‌తో పోలిస్తే ఇది 50 శాతం అధికం. ర‌న్న‌ర‌ప్‌గా నిలిచే జ‌ట్టు 150,000 డాల‌ర్లు (సుమారు రూ. 1.3 కోట్లు) ప్రైజ్‌మ‌నీ సొంతం చేసుకోనుంది. మూడు, నాలుగు స్ధానాల్లో నిలిచే జ‌ట్లు వ‌రుస‌గా రూ. 80, 60 ల‌క్ష‌లు ద‌క్కించుకోనున్నాయి.

చదవండి: కుంబ్లేకి చెప్పి ఏడ్చాను.. అయినా పట్టించుకోలేదు.. కేఎల్‌ రాహుల్‌ కాల్‌ చేసి: క్రిస్‌ గేల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement