భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్.. ఐపీఎల్‌లో అరంగేట్రం చేసి నాలుగేళ్ల అవుతున్నప్పటికి అతడు ఆడిన మ్యాచ్‌ల సంఖ్య మాత్రం ఐదే ఐదు. అర్జున్ టెండూల్కర్‌ను ఐపీఎల్-2021 వేలంలో ముంబై ఇండియన్స్ తొలిసారిగా రూ.20 లక్షల ప్రైస్‌కు కొనుగోలు చేసింది.
అయితే మొదటి రెండు సీజన్లలో (2021, 2022) అతనికి తుది జట్టులో అవకాశం రాలేదు. అనంతరం రెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వాంఖడే స్టేడియంలో వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై అర్జున్ తన మొదటి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్‌ను ఔట్ చేసి తన తొలి ఐపీఎల్ వికెట్‌ను సాధించాడు.
అయితే ఆ తర్వాత అతడికి పెద్దగా అవకాశాలు రాలేదు. ప్రతీ సీజన్‌లోనూ ముంబై అతడిని తమ జట్టులో కొనసాగించేది. కానీ తుది జట్టులో మాత్రం అర్జున్‌కు చోటు దక్కకపోయేది. కేవలం బెంచ్‌కే పరిమితమయ్యాడు. లేదా నెట్ బౌలర్‌గా అతడిని ఉపయోగించుకునేవారు. అతడు ఆరు సీజన్‌లలో అతడు ముంబై తరపున కేవలం ఐదు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.
అయితే ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు అర్జున్ టెండూల్కర్‌ను ముంబై ఇండియన్స్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్ ట్రేడ్ చేసుకుంది. దీంతో అర్జున్ తలరాత మారుతుందని అంతా భావించారు. కానీ ఇక్కడ కూడా అదే పరిస్థితి. లక్నో జట్టు బుధవారం ఏకనా స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడింది. అయితే ఈ మ్యాచ్‌లో లక్నో తరపున అర్జున్ డెబ్యూ చేస్తాడని అంతా భావించారు. కానీ అతడికి ప్లేయింగ్ లెవెన్‌లో కాదు కాదా, కనీసం ఇంపాక్ట్ ప్లేయర్ల లిస్ట్‌లో కూడా చోటు దక్కలేదు.
లక్నో నలుగురు పేసర్లతో బరిలోకి దిగినప్పటికి, అర్జున్ వైపు మాత్రం లక్నో టీమ్‌మెనెజ్‌మెంట్ మొగ్గు చూపలేదు. అయితే ఈ మ్యాచ్‌లో యువ పేసర్లు ప్రిన్స్ యాదవ్, మోహ్షిన్ ఖాన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. వీరితో పాటు సీనియర్ ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీ, నోకియా కూడా ఫర్వాలేదన్పించారు. దీంతో ఇప్పటిలో అర్జున్ లక్నో తరపున డెబ్యూ చేసే సూచనలు కన్పించడం లేదు.
చదవండి: IPL 2026: ఇంపాక్ట్‌గా వచ్చి ఇరగదీశాడు.. ఎవరీ సమీర్ రిజ్వీ?


