ఆంటోనెల్లికి ‘పోల్‌ పొజిషన్‌’ | Antonelli takes pole position at Japanese Grand Prix | Sakshi
Sakshi News home page

ఆంటోనెల్లికి ‘పోల్‌ పొజిషన్‌’

Mar 29 2026 3:42 AM | Updated on Mar 29 2026 3:42 AM

Antonelli takes pole position at Japanese Grand Prix

జపాన్‌ గ్రాండ్‌ ప్రి

సుజుకా (జపాన్‌): ఫార్ములావన్‌ (ఎఫ్‌1) జపాన్‌ గ్రాండ్‌ ప్రిలో మెర్సిడెస్‌ డ్రైవర్‌ కిమీ ఆంటోనెల్లి ‘పోల్‌ పొజిషన్‌’సాధించాడు. గత రేసు చైనా గ్రాండ్‌ ప్రిలో విజేతగా నిలిచిన 19 ఏళ్ల ఈ డ్రైవర్‌... వాయు వేగంతో దూసుకెళ్లి అందరికంటే ముందు నిలిచాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్‌ రేసులో ఆంటోనెల్లి 1 నిమిషం 28.778 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానం దక్కించుకున్నాడు. 5.8 కిలోమీటర్ల కష్టతరమైన సర్క్యూట్‌ను ఆంటోనెల్లి అవలీలగా పూర్తిచేశాడు. 

మెర్సిడెస్‌కే చెందిన జార్జ్‌ రసెల్‌ (1 నిమిషం 29.076 సెకన్లు) రెండో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు జరిగిన మూడు రేసుల్లోనూ ఈ ఇద్దరే తొలి రెండు స్థానాల్లో నిలవడం విశేషం. గతేడాది మెక్‌లారెన్‌ డ్రైవర్లు ఆస్కార్‌ పియాస్ట్రి, నోరిస్‌ సత్తాచాటగా... ఆ ఈసారి మెర్సిడెస్‌ డ్రైవర్లు జోరు కనబరుస్తున్నారు. తాజా క్వాలిఫయింగ్‌ రేసులో పియాస్ట్రి (1 నిమిషం 29.132 సెకన్లు; మెక్‌లారెన్‌), చార్లెస్‌ లెక్‌లెర్క్‌(1 నిమిషం 29.405 సెకన్లు) వరుసగా మూడో, నాలుగో స్థానాల్లో నిలిచారు. 

లాండో నోరిస్‌ (1 నిమిషం 29.409 సెకన్లు) ఐదో స్థానానికి పరిమితం కాగా... ఏడుసార్లు ప్రపంచ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ (1 నిమిషం 29.567 సెకన్లు) ఆరో స్థానంలో నిలిచాడు. నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ (1 నిమషం 30.262 సెకన్లు) పదకొండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 

Advertisement
 
Advertisement
Advertisement