జడ్డూ.. గ్లాస్‌లో ఐస్‌ ఉండాలి: అజయ్‌ జడేజా

Ajay Jadeja Trolls Ravindra Jadeja Over Ice Pack On Shoulder  - Sakshi

జడేజా ద్వయం ఐస్‌-గ్లాస్‌ ముచ్చట్లు

న్యూఢిల్లీ:  టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాను మాజీ క్రికెటర్‌ అజయ్‌ జడేజా ట్రోల్‌ చేశాడు. ఆసీస్‌తో జరిగిన మూడో వన్డే తర్వాత రవీంద్ర జడేజాను సరదాగా ఆట పట్టించే యత్నం చేశాడు. పోస్ట్‌ మ్యాచ్‌ షోలో భాగంగా సోనీ టెన్‌ చాట్‌లో రవీంద్ర జడేజాతో ముచ్చటించే క్రమంలో  ఐస్‌ ప్యాక్‌ను భుజంపై పెట్టుకోవడాన్ని అజయ్‌ జడేజా ప్రత్యేకంగా ప్రస్తావించాడు.  ఇలా ఐస్‌ప్యాక్‌ను భుజాలపై పెట్టుకోవడం తనకు బాధేస్తుందన్నాడు. ‘గ్లాస్‌లో ఉండాల్సిన ఐస్‌ ప్యాక్‌ను భుజాలపై పెట్టుకుంటావా’ అంటూ సెటైర్‌ వేశాడు.  మందు గ్లాస్‌లో ఉండాల్సిన ఐస్‌ను భుజాలపై ఎందుకు పెట్టుకుంటావు అనే అర్థం వచ్చేలా అజయ్‌ జడేజా ఫన్నీ ఫన్నీగా మాట్లాడాడు. (‘ఐపీఎల్‌ వేలంలో అతని కోసం పోటీ తప్పదు’)

దీనికి స్టూడియోలో ఉన్నవాళ్లతో పాటు చాట్‌లో పాల్గొన్న రవీంద్ర జడేజా కూడా పగలబడి నవ్వాడు. ఈ షోలో సెహ్వాగ్‌ కూడా పాల్గొన్నాడు. అయితే అజయ్‌ జడేజాకు సమాధానం ఇచ్చే క్రమంలో రవీంద్ర జడేజా కాస్త సమయస్ఫూర్తిగా వ్యవహరించాడు. ‘ అవును.. ఇక్కడ రాత్రి కదా.. నువ్వు చెప్పిందే నిజమే. ఐస్‌ అనేది గ్లాస్‌లో ఉండాలి’ అంటూ జడేజా బదులిచ్చాడు. బుధవారం జరిగిన మూడో వన్డేలో రవీంద్ర జడేజా-హార్దిక్‌ పాండ్యాల జోడి 150 పరుగులు జోడించి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. దాంతో వీరిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధానంగా హార్దిక్‌కు జడేజా ఇచ్చిన మద్దతును పలువురు కొనియాడుతున్నారు. గతేడాది రవీంద్ర జడేజాను విమర్శించిన కామెంటేటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ సైతం ప్రశంసలు కురిపించడం విశేషం. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top