Wasim Jaffer: 'After Kohli, Shubman Gill Probably Be The Next Big Batsman' - Sakshi
Sakshi News home page

IND vs BAN: 'విరాట్‌ కోహ్లి తర్వాత అతడే భారత స్టార్‌ ఆటగాడు'

Dec 17 2022 11:25 AM | Updated on Dec 17 2022 11:45 AM

After Virat Kohli,Shubman Gill probably be the next big batsman - Sakshi

భారత యువ ఆటగాడు శుబ్‌మాన్‌ గిల్‌ వైట్‌బాల్‌ క్రికెట్‌లోనే కాకుండా.. టెస్టుల్లో కూడా అదరగొడుతున్నాడు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో గిల్‌ అద్భుతమైన సెంచరీ సాధించాడు. కాగా తన టెస్టు కెరీర్‌లో గిల్‌కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం.

తొలి ఇన్నింగ్స్‌లో గిల్‌ విఫలమైనప్పటికీ.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 110 పరుగులు చేశాడు. ఈ క్రమంలో గిల్‌పై భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్‌ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. భారత క్రికెట్‌లో స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి అంతటి ఆటగాడు గిల్‌ అవుతాడని జాఫర్‌ కొనియాడాడు.

"టెస్టు జట్టులోకి గిల్‌ను ఎంపిక చేయడం మంచి నిర్ణయం. ఇంతకు ముందు రెండు అవకాశాలను గిల్‌ సద్వినియోగ పరుచుకోలేకపోయాడు. కానీ ఈ సారి మాత్రం గిల్‌ అదరగొట్టాడు. అతడు టెస్టుల్లో తొలి సెంచరీ సాధించడం సంతోషంగా ఉంది. గిల్‌ అద్భుతమైన ఆటగాడు. భారత జట్టులో విరాట్ కోహ్లి తర్వాత అంతటి స్థాయి ఆటగాడు గిల్‌ అవుతాడని నేను భావిస్తున్నాను.

గిల్‌కు మూడు ఫార్మాట్లలో రాణించే సత్తా ఉంది. ఒక వేళ రోహిత్‌ రెండో టెస్టుకు జట్టులోకి వచ్చినా.. గిల్‌ను మాత్రంను ప్లేయింగ్‌ ఎలవెన్‌లో కొనసాగిస్తారని నేను అనుకుంటున్నాను. గిల్‌ గతంలో పంజాబ్‌ జట్టుకు మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ వచ్చేవాడు. కాబట్టి  అతడు ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అద్భుతంగా రాణించగలడు. కాగా బంగ్లాతో  రెండో టెస్టులో ఓ స్పిన్నర్‌ను పక్కన పెట్టే ఛాన్స్‌ ఉంది" అని ఈఎస్పీఎన్‌తో జాఫర్‌ పేర్కొన్నాడు.
చదవండి: IND vs BAN: బంగ్లాదేశ్‌ తొలి టెస్టు గెలుస్తుందా? విలేకరికి దిమ్మతిరిగే సమాధానమిచ్చిన కుల్దీప్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement