వైభవ్‌ కోసం పడిగాపులు.. అస్సలు తగ్గేదేలే! | After-IPL 2026 Success-Vaibhav Sooryavanshi Endorsement fees Doubled | Sakshi
Sakshi News home page

వైభవ్‌ కోసం పడిగాపులు.. బ్రాండ్‌వాల్యూ డబుల్‌, అస్సలు తగ్గేదేలే!

Jun 2 2026 1:21 PM | Updated on Jun 2 2026 1:53 PM

After-IPL 2026 Success-Vaibhav Sooryavanshi Endorsement fees Doubled

రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఆట‌గాడు వైభ‌వ్ సూర్య‌వంశీ భార‌త క్రికెట్‌లో వండ‌ర్‌కిడ్ అనడంలో సందేహం లేదు. 15 ఏళ్ల వ‌య‌సులోనే బ్యాటింగ్‌లో విధ్వంసం సృష్టిస్తున్న వైభ‌వ్ సూర్య‌వంశీ ఇప్పటికిప్పుడు వేలంలోకి వ‌స్తే 30 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు  భార‌త మాజీ క్రికెట‌ర్లు సెహ్వాగ్‌, ఆకాశ్ చోప్రా పేర్కొన్నారు. 

అందుకు త‌గ్గ‌ట్లే వైభ‌వ్ ఈ సీజ‌న్‌లో 16 మ్యాచ్‌ల్లో 237 స్ట్రైక్‌రేట్‌తో 776 ప‌రుగులు సాధించాడు. ఆరెంజ్ క్యాప్ స‌హా మోస్ట్ వాల్యుబుల్‌ ప్లేయ‌ర్‌గా ఎంపికైన వైభ‌వ్ రూ.55 ల‌క్ష‌లు అందుకున్నాడు. దీంతో వైభ‌వ్ ఆట మార‌డంతోనే అత‌డి బ్రాండ్‌వాల్యూ కూడా అంతే స్థాయిలో పెరిగిపోయిన‌ట్లుగా తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజ‌న్‌కు ముందు తాను సంత‌కాలు చేసిన ఎండార్స్‌మెంట్ల‌కు సంబంధించిన ఫీజుల‌న్నింటిని డ‌బుల్ చేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. 

వైభ‌వ్ ఇప్ప‌టికే కాంప్లాన్‌, రెడ్‌బుల్ వంటి బ్రాండ్‌ల‌కు అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న వైభ‌వ్‌.. ఇటీవ‌లే ఐపీఎల్‌లో విధ్వంస‌క‌ర ప్ర‌ద‌ర్శ‌న‌తో అత‌డితో ఒప్పందం కుదుర్చుకోవ‌డానికి అనేక కంపెనీలు పోటీ ప‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే వైభ‌వ్ సూర్య‌వంశీ త‌న ఎండార్స్‌మెంట్ ఫీజుల‌ను రెట్టింపు చేసిన‌ట్లు ఒక కంపెనీకి చెందిన అడ్వ‌ర్టైజింగ్ అధికారి పేర్కొన్నారు. 

ఐపీఎల్ 2026 సీజ‌న్ ప్రారంభానికి ముందు వైభ‌వ్ ఒక్కో ఒప్పందానికి సుమారు రూ.కోటి చొప్పున సంత‌కాలు చేశాడు. సీజ‌న్ ముగిసిన త‌ర్వాత మాత్రం అత‌డు ఒక్కో ఒప్పందానికి రూ. 1.5 కోట్ల నుంచి 2 కోట్ల వ‌ర‌కు ఫీజు వ‌సూలు చేస్తున్న‌ట్లు స‌ద‌రు అధికారి పేర్కొన్నాడు. ఆట మార‌డంతోనే బ్రాండ్ కూడా మారిపోయిన వైభ‌వ్ సూర్య‌వంశీ కెరీర్ ఉన్న‌త ద‌శ‌లో ఉంది. 

ఐపీఎల్ ప్ర‌ద‌ర్శ‌న‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని కెరీర్‌ను స‌రిగ్గా ప్లాన్ చేసుకుంటే మాత్రం వైభ‌వ్ స‌మీప భ‌విష్య‌త్తులో ఉన్న‌త శిఖరాల‌ను చేరుకోవ‌డం ఖాయం. క్రికెట్‌లో ఇప్ప‌టికే వైభ‌వ్‌ను దిగ్గ‌జాలు సునీల్ గావ‌స్క‌ర్‌, స‌చిన్ టెండూల్క‌ర్‌తో పాటు స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ వంటి క్రికెట‌ర్ల‌తో పోలుస్తున్నారు. ఇలాంటి బ్రాండ్ వాల్యూలకు ఆక‌ర్షితుడ‌వ్వ‌కుండా కెరీర్ కోసం క‌ష్ట‌ప‌డితే మాత్రం వైభ‌వ్‌కు ఇంత‌మించి ఎండార్స్‌మెంట్లు వ‌స్తాయ‌న‌డంలో సందేహాం లేదు.

చదవండి: కింగ్ ప‌దానికి కోహ్లీ అర్హుడు కాదు.. పాక్ క‌ప‌ట బుద్ధి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement