పాకిస్తాన్‌ క్రికెటర్లకు సువర్ణావకాశం | 4 Pakistan Players Picked In English Teams | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ క్రికెటర్లకు సువర్ణావకాశం

Apr 8 2026 3:31 PM | Updated on Apr 8 2026 3:45 PM

4 Pakistan Players Picked In English Teams

నలుగురు పాకిస్తాన్‌ క్రికెటర్లు లక్కీ ఛాన్స్‌ కొట్టారు. త్వరలో ప్రారంభం​ కానున్న ఇంగ్లండ్‌ దేశవాలీ సీజన్‌ కోసం వేర్వేరు జట్లకు ఎంపికయ్యారు. మొహమ్మద్‌ అబ్బాస్‌, సుఫియాన్‌ ముఖీమ్‌ను డెర్బీషైర్‌.. ఉసామా మిర్‌ను వార్సెస్టర్‌షైర్‌ జట్లు ఎంపిక చేసుకున్నాయి. మొహమ్మద్‌ నవాజ్‌ టీ20 బ్లాస్ట్‌ (జట్టు ఖరారు కాలేదు) ఆడేందుకు అనుమతి  పొందాడు. 

వీరందరికీ పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు NOCలు జారీ చేసింది. వీరిలో నవాజ్‌, ఉసామా మిర్‌కు దీర్ఘకాలిక అనుమతి లభించగా.. సుఫియాన్‌ ముఖీమ్‌ జూన్‌ 7 వరకు మాత్రమే అనుమతి పొందాడు. మరో క్రికెటర్‌ అబ్బాస్‌కు సీజన్‌ మొత్తానికి అనుమతి లభించింది.

స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన మొహమ్మద్‌ నవాజ్‌, స్పిన్‌ బౌలర్‌ సుఫియాన్‌ ముఖీమ్‌ T20 బ్లాస్ట్‌లో మాత్రమే ఆడనుండగా.. ఫాస్ట్‌ బౌలర్‌ మొహమ్మద్‌ అబ్బాస్‌ కౌంటీ ఛాంపియన్‌షిప్‌తో పాటు అన్ని ఫార్మాట్లలో ఆడతాడు. ఉసామా మిర్‌ విషయానికొస్తే.. ఈ వైవిధ్యభరితమైన స్పిన్‌ బౌలర్‌ అన్ని ఫార్మాట్లలో ఆడేందుకు అనుమతి పొందాడు.  

నవాజ్‌, ముఖీమ్‌, ఉసామా మిర్‌ T20 బ్లాస్ట్‌లో ప్రతిభను చూపి, పాకిస్తాన్‌ టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలని ఉవ్విళ్లూరుతున్నారు. జాతీయ జట్టులోకి తిరిగి వచ్చేందుకు వీరికి ఇది సువర్ణావకాశం.   

Advertisement
 
Advertisement
Advertisement