బలవంతుడినని చూపించేందుకు పోయి బొక్కబోర్లా

Man Dressed As Superman Gets Hit By Bus While Making A Stunt - Sakshi

సూపర్‌మ్యాన్‌ అంటే చిన్నారులకు ఎంతో ఇష్టం. సూపర్‌మ్యాన్‌ చేసే విన్యాసాలు.. సాహసాలు ఆకట్టుకుంటాయి. రీల్‌ లైఫ్‌లో అలా ఉండగా రియల్‌ లైఫ్‌లో కూడా ఓ సూపర్‌మ్యాన్‌ వేషం వేసిన అతడు చేసిన ప్రయత్నం విఫలమైంది. తన బలం చూపించాలనుకుని ప్రయత్నించి బస్సు ముందు బెడిసికొట్టింది. అతడిని బస్సును ఢీకొట్టినా కూడా ఏం కాలేదు. ప్రయోగాత్మకంగా అతడు చేసిన విన్యాసం తెగ నవ్వులు తెప్పిస్తోంది. బ్రెజిల్‌కు చెందిన హాస్యనటుడు లూయిజ్ రిబీరో డి గ్రాండే తన బలాన్ని చూపించే ప్రయత్నం చేశాడు. సూపర్‌మ్యాన్ వేషం ధరించి తన చేత్తో దాన్ని ఆపినట్లు నటించాడు. అయితే అతడిని బస్సును ఢీకొట్టడంతో కొంత గందరగోళం ఏర్పడింది.

బ్రెజిల్ మునిసిపాలిటీ బార్రా డోస్ కోక్విరోస్‌లో ఈ షూటింగ్‌ చేశారు. లూయిజ్ ఒక క్లాసిక్ సూపర్‌మ్యాన్ స్టంట్‌ను అనుకరించేందుకు ప్రయత్నించాడు. అందులో భాగంగా తన సూపర్ బలాన్ని నిరూపించడానికి ఈ స్టంట్‌ చేశాడు. కదిలే వాహనాన్ని చేతితో ఆపడానికి ప్రయత్నించాడు. అయితే బస్సు ఢీకొట్టడంతో అతడు కొంచెం కదిలాడు. కెమెరా ఫోన్ చిత్రీకరించిన ఫుటేజ్ కూడా కొంత గందరగోళం ఏర్పడింది. "ఇప్పుడు నేను నిజంగా ఉక్కుతో తయారయ్యానని చూశాను" అని లూయిజ్ రిబీరో డి గ్రాండే చెబుతుండగా ఈ ఘటన జరిగింది. అతను బస్సును ఢీకొట్టి ముందుకు నెట్టడంతో విషయాలు అకస్మాత్తుగా పరిస్థితి తారుమారైంది. అయితే అతడిని బస్సును ఢీకొట్టినా కూడా అదృష్టవశాత్తూ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రయోగాత్మకంగా అతడు చేసిన విన్యాసంపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top