నేటి నుంచి ఎస్‌జీఎఫ్‌ క్రీడా పోటీలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఎస్‌జీఎఫ్‌ క్రీడా పోటీలు

Sep 17 2026 8:29 AM | Updated on Sep 17 2026 8:29 AM

సిద్దిపేటఎడ్యుకేషన్‌: స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌(ఎస్‌జీఎఫ్‌) జిల్లా స్థాయి అండర్‌–19 క్రీడా పోటీలను ఈ నెల 17 నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు అండర్‌–19 ఎస్‌జీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు బుధవారం రవీందర్‌రెడ్డి ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఎం.సమ్మయ్య, స్థానిక కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రమీలతో కలిసి వివరాలను వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల(కో–ఎడ్యుకేషన్‌) ఆవరణ లో ఈ నెల 17, 18న అండర్‌ 19 విభాగంలో బాలికలకు కబడ్డీ ఎంపిక పోటీలను, బాలుర కు 19, 21న నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇక ఖోఖో పోటీలను గజ్వేల్‌ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల ఆవరణలో ఈ నెల 25, 26న బాలికలకు, 28, 29న బాలురకు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ నెల 29న చెస్‌ పోటీలను బాల, బాలికలకు గజ్వేల్‌ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల కాన్ఫరెన్స్‌ హాల్‌ లో నిర్వహించనున్నట్లు చెప్పారు. క్రీడాకారు లు సకాలంలో రిపోర్టు చేయాలని సూచించారు.

మల్లన్న హుండీ ఆదాయం రూ.74.52 లక్షలు

కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి ఖజానాకు భక్తులు వేసిన కానుకలతో 63రోజుల్లో హుండీ ద్వారా రూ.74,52,087ల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి కట్ట సుధాకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం స్వామి వారి ఆలయ ముఖ మండపంలో ఆలయంలోని హుండీలనూ ఆలయఈఓ, ిదేవాదాయ శాఖ సిద్దిపేట డివిజన్‌ ఇన్‌స్పెక్టర్‌ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది, శివరామకృష్ణ భజనమండలి సేవాసమితి సభ్యులు లెక్కించారు. ఈ సందర్భంగా నగదు రూ.74,52,087, మిశ్రమ బంగారం 32గ్రాములు, మిశ్రమ వెండి 3కిలోల 200గ్రాములు,విదేశి కరెన్సీ నోట్లు 31 వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ బుద్ది శ్రీనివాస్‌, పర్యవేక్షకులు చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

ప్రజా కళాజాతరను

విజయవంతం చేయండి

సిద్దిపేటకమాన్‌: విమలక్క యాభై ఏళ్ల ప్రస్థానం సందర్భంగా ఈ నెల 26, 27, 28వ తేదీల్లో మూడు రోజుల పాటు జరగనున్న ప్రజా కళా జాతరను విజయవంతం చేయాలని ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక రాష్ట్ర కన్వీనర్‌ సంతోష్‌ తెలిపారు. సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంతోశ్‌0 మాట్లాడుతూ..యాభై ఏళ్ల విమలక్క పాటల ప్రస్థానాన్ని ప్రజా కళా జాతరగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎల్లం, రమ, ప్రభాకర్‌, మల్లేశం, వేణు, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌లో

ప్రజాపాలన వేడుకలు

సిద్దిపేటరూరల్‌: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జిల్లాకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర బాలల హక్కుల రక్షణ కమిషన్‌ చైర్‌పర్సన్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ముఖ్యఅతిథి కొత్తకోట సీత కలెక్టరేట్‌కు చేరుకుని 9.55 నిమిషాలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఇందుకోసం జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్దం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement