కొమురవెల్లి (సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఉత్తర్వుల మేరకు సోమవారం ఘనంగా వరుణయాగాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహాగణపతి పూజ, గౌరీపూజ, రక్షాబంధనం, స్వస్తి పుణ్యాహవచనం, నవగ్రహ, దిక్పాలక, ఏకాదశ రుద్ర, పంచాచార్య కలశ స్థాపన, ఆరాధన, మహాగణపతి హోమం, ఆవాహిక మండపా దేవత ఆవాహనం, రుద్రహోమం, వరుణ మూల మంత్ర, జయాధి హోమం, పూర్ణాహుతి పూజలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి 108 ఘటాలతో మహాస్వప్నం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో కట్టా సుధాకర్‌రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్, ఏఈఓ బుడ్డి శ్రీనివాస్, పర్యవేక్షకుడు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


