విత్తన మేళాలతో ఒరిగేదేమీలేదు. విత్తనాలకు సబ్సిడీ వర్తింపజేయపోగా, బహిరంగ మార్కెట్‌లో దొరికే విత్తనాలనే అదే ధరపై అందిస్తున్నారు. పప్పుధాన్యాలు పండిద్దామనుకుంటే...కోతుల బెడదతో ఆ పంటలకు నష్టం జరగనుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి...?
–నరేందర్‌రెడ్డి,రైతు, ధర్మారెడ్డిపల్లి–గజ్వేల్ మండలం
విత్తన మేళాలో అందజేస్తున్న విత్తనాలకు సబ్సీడీ వర్తించదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. మేళాలో రైతులు ఎక్కువమంది పాల్గొనేలా చూస్తాం.
– మల్లయ్య, జిల్లా ఇన్‌చార్జి వ్యవసాయాధికారి


