ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు కొమురవెల్లి మండలం గురువన్నపేటకు చెందిన పుట్ట వెంకటేశం. ఇతనికి ఆరెకరాల పొలం ఉంది. బోర్ ఉంది..ప్రతీ సంవత్సరం ఆరెకరాలు సాగు చేస్తున్నారు. గతేడాది విద్యుత్తు అంతరాయం లేకుండా రావడంతో ఆరు ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈ సారి విద్యుత్తు సరఫరా 11 నుంచి 12 గంటలే వస్తుండటంతో మూడెకరాలు మాత్రమే సాగు చేస్తున్నారు. ఓ వైపు వర్షాలు కురవకపోవడం...మరోవైపు విద్యుత్ సరఫరా 24గంటలు వ్యవసాయంకు అందించకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నామని, వ్యవసాయానికి 24గంటలు విద్యుత్ సరఫరా చేయాలని వెంకటేశం కోరుతున్నారు.


