● దేవదాయశాఖ స్థపతి వల్లి నాయకం
● పోచమ్మ ఆలయంలో శిలాయంత్ర ప్రతిష్ఠ
దుబ్బాక: దేవాలయాల నిర్మాణంతోపాటు విగ్రహాల యంత్ర ప్రతిష్ఠ ఆగమశాస్త్రం ప్రకారమే నిర్వహిస్తున్నట్లు దేవదాయశాఖ స్థపతి వల్లినాయకం స్పష్టం చేశారు. దుబ్బాకలో పోచమ్మ ఆలయం పునరుద్ధరణలో భాగంగా ఆదివారం శిలా యంత్ర ప్రతిష్ఠ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామాల్లో గ్రామదేవతల ఆలయాలు ఉండటం చాలా శ్రేష్టమన్నారు. అమ్మవార్ల దయతో పచ్చని పంటలతో ఆయా గ్రామాలు సుభిక్షంగా ఉంటాయని చెప్పారు. పోచమ్మ ఆలయం పునర్నిర్మాణం చేపట్టడం సంతోషకరమన్నారు. ఆలయంలో అన్ని దేవతల విగ్రహాలను శాస్త్రప్రకారం ప్రతిష్ఠించాలని సూచించారు. నూతన ఆలయాలు నిర్మించడంతోపాటు ఆలయాలు ధూప, దీప,నైవేద్యాలతో విరజిల్లాలని ఆకాంక్షించారు.


