మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్
హుస్నాబాద్‌రూరల్/హుస్నాబాద్: రైతులు వరి సాగు తగ్గించి ఆరుతడి పంటలే సాగు చేయాల ని మంత్రి పొన్న ప్రభాకర్ స్పష్టం చేశారు. తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో వచ్చే జూన్ వరకు వర్షాలు పడే అవకాశం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నా వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని అవగాహన కల్పిస్తున్నా రైతు లు వినడం లేదని మంత్రి ఆందోళ న వ్యక్తం చేశారు. హుస్నాబాద్ డివిజన్ ఇంటి గ్రేటెడ్ కార్యాలయంలో మూడు జిల్లాల కలెక్ట ర్లు, అధికారులతో ఎల్‌నినో ప్రభావం ప్రత్యా మ్నాయ పంటల సాగుపై గురువారం నిర్వహించిన సమీక్షలో మంత్రి పాల్గొని దిశానిర్దేశం చేశారు. వందెకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేసే గ్రామాలకు ప్రభుత్వం రూ.5లక్షల ప్రోత్సా హం అందిస్తోందని చెప్పారు. ఆయిల్‌పామ్ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేందుకు నర్మెటలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. నీటి వనరులను ఆయా జిల్లాల కలెక్టర్లు పర్యవేక్షించి తాగునీటి సరఫరాకు ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు కాల్వల భూ సేకరణకు రూ.250 కోట్లు మంజూ రయ్యాయని, ఆ పనులు వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. జలసిరి పెంచడానికి వీబీజీరాంజీ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఇంటింటికీ ఇంకుడు గుంతలు తవ్వించి భూ గర్భ జలాలను పెంచాలని సూచించారు. ఎల్‌ని నోను జాతీయ విపత్తుగా గుర్తించడానికి ప్రభు త్వం కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు.


