అరెస్ట్‌లు అప్రజాస్వామికం | - | Sakshi
Sakshi News home page

అరెస్ట్‌లు అప్రజాస్వామికం

Jul 24 2026 7:19 AM | Updated on Jul 24 2026 7:19 AM

కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి

కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి

ములుగు(గజ్వేల్‌): విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీలో శాంతియుతంగా నిరసన చేపట్టిన కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేల అరెస్ట్‌లు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ అగ్రనేతల అరెస్ట్‌లను ఖండిస్తూ ములుగు అంబేడ్కర్‌ చౌరస్తాలో పార్టీ శ్రేణులతో కలసి గురువారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘భేటీ పడావో’నినాదంతో అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ సర్కార్‌ ఢిల్లీలో విద్యార్థినుల పట్ల జరిగిన దాడి గురించి ఎందుకు మాట్లాడటం లేదన్నారు. పేపర్‌ లీక్‌పై విద్యార్థులు ఉద్యమిస్తే అరెస్ట్‌లు చేసి ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రాజీవ్‌రహదారిపై ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కడపల్ల కృష్ణారెడ్డి, చక్రాల రఘు, పంచాయతీ రాజ్‌ సంఘటన్‌ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి, జెడ్పీ కో ఆప్షన్‌ మాజీ సభ్యుడు సలీం, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విజయమోహన్‌, సర్పంచ్‌లు ముత్యంరెడ్డి, లహరి, మమత, పోచయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement