ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి
గజ్వేల్: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)కి భయపడి...కాంగ్రెస్, బీజేపీ డ్రామాలాడుతూ ప్రజలను తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆరోపించారు. గజ్వేల్‌లో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ గత 21రోజులుగా విద్యార్థుల ఉద్యమాల నేపథ్యంలో ప్రజల్లో కాక్రోచ్ జనతాపార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి కాంగ్రెస్, బీజేపీలు భయపడుతున్నాయన్నారు. రాష్ట్రంలోనూ పోటాపోటీగా ఈ రెండు పార్టీలు ఆందోళన కార్యక్రమాలను చేపడుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. వైద్య విద్యార్థుల సమస్యల పరిష్కారాని కి బీఆర్‌ఎస్ శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ఆందోళన నిర్వహించనుందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, బీఆర్‌ఎస్ గజ్వేల్ పట్టణ శాఖ అధ్యక్షుడు నవాజ్‌మీరా, మాజీ జెడ్పీటీసీ మల్లేశం, మాజీ ఆత్మకమిటీ చైర్మన్ ఊడెం కృష్ణారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు శ్రీనివాస్, కోటబాబు, నాయకులు బొగ్గుల సురేశ్ తదితరులు పాల్గొన్నారు.


