ఆస్పత్రి ఆకస్మిక తనిఖీలో కలెక్టర్ హైమావతి
హుస్నాబాద్: ప్రభుత్వాస్పత్రికి వచ్చే ప్రతీ ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలందిస్తున్నామనే భరోసా కల్పించాలని కలెక్టర్ హైమావతి పేర్కొన్నారు. పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిని గురువారం తనిఖీ చేశారు. సిబ్బంది సమయ వేళలు పాటిస్తున్నారా? లేదా? అని ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..సీజనల్ వ్యాధులకు సంబంధించి వైద్య పరికరాలు, మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆస్పత్రిలో పలు విభాగాలకు సంబంధించి వైద్య సిబ్బంది కావాలని కోరగా స్పందిస్తూ...దగ్గరలోని ఆస్పత్రి నుంచి వైద్యులు, సిబ్బందిని హుస్నాబాద్ ఆస్పత్రికి కేటాయించాలని డీఎంహెచ్‌ఓకు ఫోన్ చేసి ఆదేశించారు. ఆస్పత్రి ఎదుట రూ.82 కోట్లతో కొత్తగా చేపడుతున్న 250 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించారు.


