ఎంఈఓ రాజగోపాల్‌రెడ్డి
దుబ్బాకటౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించాలని అందకుక డిజిటల్ స్కిల్స్ దోహదపడతాయని రాయ పోల్ మండల విద్యాధికారి రాజగోపాల్‌రెడ్డి సూచించారు. మండలంలోని బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు భాస్కర్‌రెడ్డి రూ.1.50లక్షల విలువచేసే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్‌ను సైన్స్ ల్యాబ్‌ను స్వంత ఖర్చులతో ఏర్పాటు చేశారు. ఎంఈఓ రాజగోపాల్‌రెడ్డి గురువారం ల్యాబ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నేటి పోటీ ప్రపంచంలో టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందిందని దానికి అనుగుణంగా విద్యార్థులలో డిజిటల్ స్కిల్స్ నేర్పించడానికి ఈ ఇంటరక్టివ్ ఫ్లాట్ ప్యానల్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థుల కోసం ఈ ప్యానల్‌ను అందించిన ఉపాధ్యాయుడు భాస్కర్‌రెడ్డిని ఎంఈఓ అభినందించారు.


