విద్యార్థులపై దాడి అమానుషం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులపై దాడి అమానుషం

Jul 23 2026 6:48 AM | Updated on Jul 23 2026 6:48 AM

సిద్దిపేట కాంగ్రెస్‌ ర్యాలీలో పార్టీ నాయకులు

సిద్దిపేట కాంగ్రెస్‌ ర్యాలీలో పార్టీ నాయకులు

సిద్దిపేటకమాన్‌: ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద చేస్తున్న నిరసన కార్యక్రమంలో విద్యార్థులపై దాడి చేయడం అమానుషమని సిద్దిపేట కాంగ్రెస్‌ నాయకులు తెలిపారు. రాహుల్‌ గాంధీని అరెస్ట్‌ను నిరసిస్తూ, కేంద్ర శాఖ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కోరుతూ జిల్లా కేంద్రం సిద్దిపేట రైతుబజార్‌ నుంచి అంబేడ్కర్‌ చౌరస్తా వరకు విద్యార్థులతో కలిసి కాంగ్రెస్‌ నాయకులు బుధవారం ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..నీట్‌ పరీక్ష పత్రాల లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్నారు. రాజీనామా చేయకపోతే బీజేపీ నాయకుల ఇళ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. పిల్లలు లేని మోదీకి విద్యార్థుల విలువ తెలియదని చురకలంటించారు. కార్యక్రమంలో ఆత్మకమిటీ చైర్మన్‌ గోపీకృష్ణ, పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్‌, మార్క సతీశ్‌, బొమ్మల యాదగిరి, మీసం నాగరాజు, మహేందర్‌, అంజయ్య, ప్రవీణ్‌, ప్రభాకర్‌, సంతోషి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement