మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్: నీట్ పరీక్షలకు కారణమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇతర ముఖ్యనేతల అరెస్ట్‌కు నిరసనగా మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నీట్ పరీక్షల అంశంలో పార్లమెంట్‌లో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్‌పై ప్రధాని, హోమ్ మంత్రి అమిత్‌షా సమాధానం చెప్పాలన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు తిరగబడకుండా పోలీసులు కొడుతుంటే ఇంకా కొట్టండి అని గాంధేయవాదులుగా నిరసన తెలిపారన్నారు. నీట్ పరీక్షల లీక్‌తో ఆత్మహత్యకు పాల్పడ్పిన విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.


