చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా హద్దులు పెట్టి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ హైమావతి తహసీల్దార్‌కు సూచించారు. మండల పరిధిలోని బుధవారం కిష్టాపూర్ రోడ్డులో అనంతగిరి రిజర్వాయర్ సమీపంలో ఉన్న 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...ప్రభుత్వ స్థలం చుట్టూ సర్వే నిర్వహించి హద్దులు వేసుకోవాలన్నారు. ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురి కాకుండా ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అనతంగిరి రిజర్వాయర్ పక్కన గల నీటి పారుదల శాఖకు చెందిన భూమిని పరిశీలించారు. అక్రమంగా కబ్జా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సలీమ్ తదితరులు ఉన్నారు.


