● మంత్రి కొండా సురేఖను కలిసిన దుబ్బాక బాలాజీ ఆలయ కమిటీ ● మంత్రి చేతుల మీదుగా బ్రహ్మోత్సవాల పత్రిక ఆవిష్కరణ
దుబ్బాక: వచ్చే నెల 20 నుంచి జరిగే దుబ్బాక బాలాజీ ఆలయం బ్రహ్మోత్సవాలకు రావాలని దేవదాయశాఖ మంత్రి కొండా సురేఖను ఆలయ కమిటీ బాధ్యలు ఆహ్వానించారు. ఆలయకమిటీ ఆధ్వర్యంలో మంత్రి కొండా సురేఖను మంగళవారం హైదరాబాద్‌లో కలిసి బ్రహ్మోత్సవాల పత్రికను మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించి ఆమెకు పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...దుబ్బాక బాలాజీ ఆలయం అనతి కాలంలోనే రాష్ట్రంలోనే గొప్ప ఆలయంగా ప్రసిద్ధి చెందడం సంతోషకరమన్నారు. బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాలని తాను తప్పకుండా వస్తానని చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో ఆలయం చైర్మన్ వడ్లకొండ శ్రీధర్, ప్రధాన కార్యదర్శి చింత రాజు, బాధ్యులు కూర వేణుగోపాల్, చింత నాగేందర్ ఆలయ ప్రధాన అర్చకులు అచ్చి లక్ష్మీనర్సింహచార్యులు తదితరులు ఉన్నారు.


