విద్యార్థులపై అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తప్పవు. టీచర్లు అసభ్యంగా ప్రవర్తిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలి. ఉపాధ్యాయులు విద్యాబోధనపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. బెజ్జంకి ఘటనలో పీడీ కనకారెడ్డిని రిమూవల్, ప్రిన్సిపాల్ సంగీతలను కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేశాం. పూర్తిస్థాయి నివేదిక కోసం నలుగురితో కమిటీని జిల్లా కలెక్టర్ నియమించారు. రమేశ్, ఇన్‌చార్జి డీఈఓ
గుడ్, బ్యాడ్ టచ్‌లపై అవగాహన
విద్యార్థినులు అందరూ గుడ్, బ్యాడ్ టచ్‌లపై అవగాహన కలిగి ఉండాలి. అసభ్యంగా ప్రవర్తించే వారితో జాగ్రత్తగా ఉండాలి. ప్రతీ రోజు పాఠశాలలో మూడు టీంలు పాఠశాలలో అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నాం. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే 8712667434 ఫోన్ నంబర్‌కు సమాచారం అందించాలి.
– దుర్గ, సీఐ, షీ టీమ్స్


