నంగునూరు(సిద్దిపేట): ఎల్ నినో ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం తక్కువగా ఉందని, కాబట్టి వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని డీఆర్‌డీఓ రవీందర్ రైతులకు సూచించారు. నర్మేట, అప్పలాయిచెర్వు, మైసంపల్లి, అంక్షాపూర్, ఖానాపూర్‌లో మంగళవారం గ్రామసభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ భూగర్భ జలాలు అడుగంటకుండా బోర్లు, బావుల్లో నీరు చేరేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.
కరువు పరిస్థితులపై అప్రమత్తం
బెజ్జంకి(సిద్దిపేట): బెజ్జంకి మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం సర్పంచ్‌లు, మండల స్థాయి అధికారులకు ఆర్‌డీఓ అడిషనల్ పీడీ శ్రీనివాస్ ఎల్ నినో పరిస్థితులపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఇంట ఇంకుడు గుంతలు నిర్మిచుకోవాలన్నారు. ఉద్యాన పంటలు, ఆరుతడి పంటలు సేద్యం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రవీణ్, ఏపీఓ, ఎంపీఓ పాల్గొన్నారు.


