బాధ్యతగా పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

బాధ్యతగా పనిచేయాలి

Jul 19 2026 6:47 AM | Updated on Jul 19 2026 6:47 AM

సిద్దిపేటకమాన్‌: ప్రతీ ఒక్కరూ మెరుగైన సమాజం కోసం బాధ్యత పనిచేయాలని మన పోలీస్‌ బలగమే మన గర్వం మన సమాజమే మన బాధ్యతని సీపీ రష్మీ పెరుమాళ్‌ తెలిపారు. పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో ‘‘సీపీ కనెక్ట్‌’’అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన సీపీ విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసులను శనివారం అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పోలీసు సిబ్బందిలో ఉత్తమ సేవలను గుర్తించే సంస్కృతి, మనోధైర్యం పెంచడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. ప్రతీ నెల ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల సిబ్బందికి మరింత ఉత్సాహం, బాధ్యత కలగడంతోపాటు ఇతరులకు ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్‌ కుశాల్కర్‌, ఏఆర్‌ అదనపు డీసీపీ సుభాష్‌ చంద్రబోస్‌, సీఐ కిరణ్‌, ఆర్‌ఎస్‌ఐ సాయిప్రసాద్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సీపీ రష్మీ పెరుమాళ్‌

ప్రతిభ కనబర్చిన సిబ్బందికి

ప్రశంసాపత్రాలు అందజేత

సీపీ కనెక్ట్‌ వినూత్న కార్యక్రమం ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement