ఉక్కపోత.. జీరో కోత | - | Sakshi
Sakshi News home page

ఉక్కపోత.. జీరో కోత

May 30 2026 8:41 AM | Updated on May 30 2026 8:41 AM

ఉక్కపోత.. జీరో కోత ఎండలు మండిపోవడంతో గృహజ్యోతి పథకం జీరో బిల్లుకు వినియోగదారులు దూరమవుతు న్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మార్చి 2024 నుంచి గృహజ్యోతి పథకం అమలు అవుతున్న విషయం తెలిసిందే. ప్రజాపాలన కార్యక్రమంలో పథకానికి సంబంధించి దరఖాస్తులు స్వీకరించారు. రేషన్‌కార్డు కలిగిన లబ్ధిదారులకు జీరో బిల్లును అమలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా గృహజ్యోతి వినియోగదారులు 2,04,838 ఉన్నా రు. ఈ ఏడాది మేలో 1,90,832 వినియోగదారులు 1,77,72,468 యూనిట్ల విద్యుత్తును వినియోగించగా, ప్రభుత్వం రూ.7,51,94,851 కోట్లు చెల్లించింది. వేసవిలో మీటర్‌ గిర్రుమని తిరగడంతో జీరో బిల్లుకు దూరమవుతుండగా, 200 యూనిట్లు దాటిన వారికి ఎన్ని యూనిట్లు ఎక్కువ అయితే వాటికే బిల్లును ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు. జిల్లావ్యాప్తంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేడిని, వడగాల్పులు తట్టుకునేందుకు పగలు, రాత్రి తేడా లేకుండా కూలర్లు, ఫ్యాన్లు అధికంగా వినియోగించారు. ఫ్యాన్‌ లేకుండా క్షణం ఉండటం గగనంగా మారింది. దీంతో ఒక్క మే నెలలో 14,006 కుటుంబాలకు జీరో బిల్లుకు దూరమయ్యారు. గతేడాది ఇదే నెలలో 10,192 కుటుంబాలు జీరో బిల్లుకు దూరం కాగా, ఈ ఏడాది 3,814 మంది 200 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్‌ను వినియోగించారు. గృహజ్యోతి కోసం కొత్తగా దరఖాస్తుల స్వీకరణ నిలిపివేశారు. గతేడాది నుంచి నూతన రేషన్‌ కార్డుల జారీ చేస్తున్నారు. దీంతో కొత్తగా రేషన్‌ కార్డులు పొందిన వారు గృహజ్యోతి కోసం దరఖాస్తు చేసేందుకు ఎదురుచూస్తున్నారు. కొత్త వారికి సైతం అవకాశం కల్పించాలని పలువురు కోరుతున్నారు. ప్రజలు పాతకాలం నాటి ఫ్లోరోసెంట్‌ బల్బులు వాడటంతో కరెంట్‌ వినియోగం పెరుగుతుంది. వీటికి బదులు ఎల్‌ఈడీ బల్బులు, ట్యూబ్‌లైట్లను వినియోగించడం మేలు. సీజన్‌ మేరకు ఫ్రీజ్‌లో ఫ్రీజర్‌ దశలు మార్చుతూ ఉండాలి. వేసవిలో ఎక్కువ ఉంచినా మిగిలిన కాలాల్లో తగ్గించుకోవాలి. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, ఎల్‌ఈడీ బల్లులు, రిఫ్రిజిరేటర్లు బీఈఈ రేటింగ్‌ 1 నుంచి 5 స్టార్లతో విక్రయిస్తున్నారు. వీటిలో 5 స్టార్‌ ఉంటే విద్యుత్తు వినియోగం తగ్గడంతో బిల్లు ఆదా అవుతుంది.

మేలో 14 వేల కుటుంబాలు దూరం 200 యూనిట్లు దాటితేబిల్లు కట్టాల్సిందే..

గృహజ్యోతి కోసం కొత్తగా దరఖాస్తుల స్వీకరణ నిలిపివేశారు. గతేడాది నుంచి నూతన రేషన్‌ కార్డుల జారీ చేస్తున్నారు. దీంతో కొత్తగా రేషన్‌ కార్డులు పొందిన వారు గృహజ్యోతి కోసం దరఖాస్తు చేసేందుకు ఎదురుచూస్తున్నారు. కొత్త వారికి సైతం అవకాశం కల్పించాలని పలువురు కోరుతున్నారు.

ఎండలతో తగ్గుతున్న ‘గృహజ్యోతి’ లబ్ధిదారులు

సిద్దిపేట పట్టణానికి చెందిన మల్లయ్య రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం కింద జీరో విద్యుత్‌ బిల్లు పొందుతున్నారు. మేలో ఎండలు బాగా ఉండటంతో ఉక్కపోతను భరించలేక ఇంట్లో ఫ్యాన్‌, కూలర్‌ ఎక్కువగా వినియోగించారు. దీంతో 206 యూనిట్ల విద్యుత్‌ నమోదైంది. బిల్లు రూ.1,121 వచ్చింది. ఆరు యూనిట్ల విద్యుత్‌ వినియోగం పెరగడంతో జీరో బిల్లుకు అర్హత సాధించలేక పోయాడు. ఇలా ఒక్క మల్లయ్యనే కాదు, చాలా మంది ఉచిత విద్యుత్‌కు దూరమవుతున్నారు. – సాక్షి, సిద్దిపేట

కొత్త వారికి వర్తించని పథకం

ఇలా చేస్తే మేలు

కొత్త వారికి వర్తించని పథకం

Advertisement
 
Advertisement
Advertisement