సీఎంకు మంత్రి పొన్నం లేఖ
హుస్నాబాద్: శాతవాహన యూనివర్సిటీ హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలో మైనింగ్ ఇంజనీరింగ్ కోర్సును మంజూరు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. తెలంగాణలో ప్రత్యేకించి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సింగరేణి కాలరీస్ ద్వారా బొగ్గు తవ్వకం కార్యకలాపాలు బలంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ సంస్థలలో బీటెక్ (మైనింగ్ ఇంజినీరింగ్) చదవడానికి అవకాశాలు చాలా పరిమితంగా ఉన్నాయన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన చాలా మంది విద్యార్థుల్లో ఆసక్తి, సామర్థ్యం ఉందన్నారు. ప్రైవేట్ కళాశాలలు, విశ్వ విద్యాలయాల్లో అధిక ఫీజుల కారణంగా ఈ కోర్సును చదవలేకపోతున్నారని లేఖలో వివరించారు. మైనింగ్ ఇంజినీరింగ్ కోర్సు ప్రవేశపెట్టడం ప్రయోజనకరంగా ఉంటుందని, అలాగే అవసరమైన సిబ్బందిని మంజూరు చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
ప్రశాంతంగా
డిపార్ట్‌మెంటల్ పరీక్షలు
ఆర్యవైశ్య మహాసభ
రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సిద్దిపేటకు చెందిన వ్యాపారవేత్త, సామాజిక సేవకుడు గంప శ్రీనివాస్ నియామకమైనట్లు ఆర్యవైశ్య మహాసభ జిల్లా కోశాధికారి డాక్టర్ మంకాల నవీన్ కుమా ర్ తెలిపారు. హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య మహాసభ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ ఆయనకు ని యామక పత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తణుకు ఆంజనేయులు, జిల్లా మాజీ అధ్యక్షుడు అయిత రత్నాకర్, మంచాల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి సముద్రాల హరినాథ్, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి తడక లింగమూర్తి పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను బుక్‌డిపోల ద్వారా విక్రయించాలనుకునే వ్యాపారులకు జిల్లా విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. అర్హులైన అభ్యర్థులు వచ్చే జూన్ 5వ తేదీలోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో తమ దరఖాస్తులను సమర్పించాలని డీఈ ఓ శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ విక్ర యాలకు దరఖాస్తు చేయాలనుకునే వారు రూ. 1,000 డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుందన్నారు. అలాగే ఈ పాఠ్యపుస్తకాల విక్రయాలకు 2026–2027 ఏడాదికి గాను సేల్స్ ట్యాక్స్, ఇన్‌కమ్ ట్యాక్స్, మున్సిపల్ ట్యాక్స్‌లను విధిగా చెల్లించిన వ్యాపారులు మాత్రమే అర్హులని ఆయన స్పష్టం చేశారు.
టీచర్ల సమస్యలు పరిష్కరించాలి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): రాష్ట్రంలోని ఉపాధ్యాయులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేటేడ్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టీపీటీఎఫ్) రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం సిద్దిపేట జిల్లాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జెండా ఆవిష్కరించి.. మరణించిన ఉపాధ్యాయులకు నివాళులర్పించా రు. ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయ సమస్యలన్నీ పోరాటాల ద్వారానే సాధించామన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి రాక ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు అనేక హామీలు ఇచ్చిందని, వెంటనే హామీలు అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో కనకయ్య, విజేందర్‌రెడ్డి, నరేందర్, రామస్వామి, తిరుపతి, మల్లేశం, అజీజ్, సత్యనారాయణ, సత్యక్రిష్ణ, రాములు, తదితరులు పాల్గొన్నారు.


