ఆటంకం లేకుండా నెట్‌వర్క్‌ సేవలు | - | Sakshi
Sakshi News home page

ఆటంకం లేకుండా నెట్‌వర్క్‌ సేవలు

May 30 2026 8:41 AM | Updated on May 30 2026 8:41 AM

సిద్దిపేటరూరల్‌: జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్‌ వినియోగదారులకు సమస్య లేకుండా చూడాలని అదనపు కలెక్టర్‌ రెవెన్యూ లక్ష్మీకిరణ్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్‌న్స్‌ హాలులో జిల్లా స్థాయి టెలికాం కమ్యూనికేషన్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... జిల్లాలో ఇంటర్నెట్‌ వినియోగదారులకు ఎలాంటి ఆటంకం కలగకుండా నెట్వర్క్‌ సేవలు అందించాలని ఆయా టెలికాన్‌ కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు. ఈ సమావేశంలో మిషన్‌ భగీరథ ఎస్‌ఈ వెంకటరెడ్డి, జిల్లా ఇండస్ట్రియల్‌ అధికారి గణేశ్‌ రామ్‌, కలెక్టరేట్‌ ఏవో రాజ్‌కుమార్‌, డీఆర్డీఓ జయదేవ్‌ ఆర్య, మున్సిపల్‌ కమిషనర్లు, టెలికాం కంపెనీల ప్రతినిధులు టీ ఫైబర్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, జియో, ఇండస్‌ టవర్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ లక్ష్మీకిరణ్‌

Advertisement
 
Advertisement
Advertisement