జిల్లాలో 938 ప్రభుత్వ పాఠశాలల్లో 81,229 మంది విద్యార్థులున్నారు. అందులో బాలురు 38,508, బాలికలు 42,721 మంది విద్యను అభ్యసిస్తున్నారు. వీరి కోసం 7,11,894 పుస్తకాలు అవసరం. అందులో పార్ట్–1కింద.. 5,33,478, పార్ట్–2 కింద 1,78,416 పుస్తకాలు ఉన్నాయి. పాఠ్యపుస్తకాలను తెలుగు, ఇంగ్లిష్ భాషలలో ముద్రించారు. రెండు భాషలలో ఉండే పుస్తకాలు రెండు పార్ట్‌లుగా విభజించారు. అందులో మొదటి పార్ట్‌తో పాటు పూర్తిగా ఇంగ్లీష్ మీడియంకు సంబంధించినవి మొత్తంగా 5,33,478 అవసరం ఉన్నాయి. అందులో ఇప్పటి వరకు 4.92లక్షల పుస్తకాలు చేరుకున్నాయి. ఇంకా 41,478 పుస్తకాలు రావాలి. అలాగే పార్ట్–2కు సంబంధించి 1,78,416 పుస్తకాలు రావల్సి ఉంది. మొదటి విడతలో రావాల్సిన వాటిలో ఇంకా ఐదు టైటిల్స్ రావాలి. అందులో 4వ తరగతి ఇంగ్లిష్, 5వ తరగతి తెలుగు, గణితం, ఆరో తరగతి ఇంగ్లిష్, 8వ తరగతి హిందీ ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి.
నేటి నుంచి ఎమ్మార్సీలకు..
మోడల్ స్కూల్స్, బీసీ, సాంఘిక సంక్షేమ, మైనార్టీ, ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాలకు 1,04,500 పుస్తకాలు ఇప్పటికే చేరుకున్నాయి. శుక్రవారం నుంచి జూన్ 7వ తేదీ వరకు మండల రిసోర్స్‌సెంటర్లకు పుస్తకాలు చేరుకోనున్నాయి. అక్కడి నుంచి ఆయా పాఠశాలలకు జూన్ 12వ తేదీలోగా చేరవేస్తారు. దీంతో పాఠశాల పునఃప్రారంభం రోజునే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందనున్నాయి. పుస్తకాలు పక్కదారి పట్టకుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీగా చర్యలు చేపడుతోంది. క్రమసంఖ్య, బార్‌కోడ్ ముద్రించారు. దీని ద్వారా ఏ మండలానికి ఎన్ని పుస్తకాలు పంపాలో స్పష్టంగా లెక్కతేలుంతుంది. ప్రైవేట్ పాఠశాలలకు చేరే అవకాశం ఉండదు.
విద్యార్థులకు ఉచితంగా అందించే నోట్ బుక్స్ నేరుగా పాఠశాలలు, ఎమ్మార్సీలకు చేరుకోనున్నాయి. 1వ, 2వ తరగతి విద్యార్థులకు మూడు చొప్పున నోట్‌బుక్స్, 3, 4, 5వ తరగతి విద్యార్థులకు నాలుగు చొప్పున , 6 నుంచి 8వ తరగతి వారికి ఆరు చొప్పున , 8వ తరగతి విద్యార్థికి ఏడు నోట్ బుక్‌లు, 9, 10వ తరగతి విద్యార్థులకు14 చొప్పున నోట్ పుస్తకాలను అందించనున్నారు.
పునఃప్రారంభం రోజే అందిస్తాం
పాఠశాలలు పునఃప్రారంభం రోజే విద్యార్థులకు పుస్తకాలు, నోట్ బుక్స్ అందజేయనున్నాం. అందు కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. పెండింగ్‌లో ఉన్న 10శాతం పుస్తకాలు సైతం త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే గురుకులాలు, మోడల్ స్కూల్స్‌కు పాఠ్యపుస్తకాలు చేరుకున్నాయి. 901 ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ఎమ్మార్సీలకు శుక్రవారం నుంచి పంపిణీ చేయనున్నాం.
– రామ్‌ప్రసాద్,
జిల్లా మేనేజర్, పాఠ్యపుస్తకాలు


