కొనుగోళ్ల ప్రక్రియ వేగిరం: సీపీ రష్మీ | - | Sakshi
Sakshi News home page

కొనుగోళ్ల ప్రక్రియ వేగిరం: సీపీ రష్మీ

May 23 2026 9:29 AM | Updated on May 23 2026 9:29 AM

హుస్నాబాద్‌: ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నాయని, సాధ్యమైనంత తొందరలోనే ప్రక్రియ పూర్తి చేస్తామని సీపీ రష్మీ పెరుమాళ్‌ అన్నారు. హుస్నాబాద్‌ పట్టణంలోని ధాన్యం దిగుమతి ప్రక్రియను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కొనుగోళ్లు, దిగుమతి ప్రక్రియ వేగవంతంగా జరుగుతోందన్నారు. హుస్నాబాద్‌ మార్కెట్‌లో హమాలీల కొరత ఉందని అధికారులు చెబుతున్నారని, హమాలీల సంఖ్యను పెంచి దిగుమతిలో జాప్యం జరగకుండా చూస్తున్నామన్నారు. ఒక ట్రాక్టర్‌ ధాన్యం అన్‌లోడింగ్‌ దిగుమతి కావాలంటే 20 నిమిషాల సమయం పడుతుంది. ఈ ఒక్క రోజే దాదాపు 60 ట్రాక్టర్ల ధాన్యం దిగుమతి అయ్యేలా అధికారులు ప్లాన్‌ చేశారన్నారు. ధాన్యం దిగుమతి విషయంలో లోకల్‌ పోలీస్‌లు సహకారం ఉందన్నారు. ఆమె వెంట ఏసీపీ సదానందం, తహసీల్దార్‌ లక్ష్మారెడ్డి, ఎస్సై లక్ష్మారెడ్డి ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement