రోడ్లపై చెత్త వేస్తే జరిమానా | - | Sakshi
Sakshi News home page

రోడ్లపై చెత్త వేస్తే జరిమానా

May 23 2026 9:29 AM | Updated on May 23 2026 9:29 AM

చేర్యాల(సిద్దిపేట): రోడ్లపై చెత్త వేస్తే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ముస్త్యాల అరుణ తెలిపారు. ఈ మేరకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు, వాటర్‌ సరఫరా, ఇతర సిబ్బంది అందరూ విధుల్లో అశ్రద్ధ చూపవద్దన్నారు. పట్టణ పరిధిలో ఎక్కడైనా రోడ్లమీద చెత్త వేస్తే రూ.వెయ్యి జరిమానా విధించాలన్నారు. పట్టణ అభివృద్ధి, పరిశుభ్రత కోసం అందరూ పనిచేయాలి అన్నారు. సమావేశంలో వైస్‌ చైర్‌పర్సన్‌ ఉమ, కౌన్సిలర్లు గీతాంజలి, సుప్రజ, సురేష్‌, ప్రసాద్‌, సదానందం, కమిషనర్‌ నాగేందర్‌, మేనేజర్‌ ప్రభాకర్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ కృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అరుణ

Advertisement
 
Advertisement
Advertisement