సిద్దిపేటకమాన్: నూతన ఆదాయపు పన్ను చట్టం ద్వారా పన్ను విధానాలు మరింత సరళీకృతం అవుతాయని, పారదర్శకత పెరుగుతుందని ఇన్‌కమ్‌ట్యాక్స్ జాయింట్ కమిషనర్ రాకేష్ అన్నారు. సిద్దిపేట పట్టణంలో పన్ను చెల్లింపుదారులకు, ట్యాక్స్ ప్రాక్టీషనర్లు, ట్రేడ్ అసోసియేషన్ ప్రతినిధులకు శుక్రవారం అవగహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాకేశ్ మాట్లాడుతూ.. నూతన ఆదాయపు పన్ను చట్టం కొత్త నిబంధనలు, విధానాలపై వివరించారు. పన్ను చెల్లింపుదారులకు సులభమైన పారదర్శకత, సాంకేతిక ఆధారిత సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.


