బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్
చిన్నకోడూరు(సిద్దిపేట): ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు భైరి శంకర్ ఆరోపించారు. బుధవారం పొద్దుతిరుగుడు పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం తహసీల్దార్ సలీమ్‌కు వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ కేంద్రానికి పొద్దుతిరుగుడు పంట తెచ్చి రెండు నెలలవుతున్నా కొనుగోలు చేయడంలేదన్నారు. ప్రభుత్వం స్పందించి పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీజేపీ మండల అధ్యక్షులు శేఖర్ గౌడ్, నాయకులు బాపయ్య, నాగరాజు, శ్రీనివాస్, పరుశరాములు తదితరులు ఉన్నారు.


