కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక
ఎక్స్–అఫీషియో సభ్యుడిగామంత్రి పొన్నం
● ఏకాభిప్రాయం కుదరకఒక సభ్యుడి ఎన్నిక పెండింగ్
సాక్షి, సిద్దిపేట: ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం తగదని, మిల్లర్ల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ హైమావతి, సీపీ రష్మీ పెరుమాళ్‌తో కలిసి సంబంధిత అధికారులతో, మిల్లర్లు, ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ కొనుగోళ్ల ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవద్దని అన్నారు. యాసంగిలో అంచనాకు మించి ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు. ఇందు కోసం 427 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా 1.20లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. మిల్లుల వద్ద హమాలీ కార్మికులను ఎక్కువగా నియమించుకుని త్వరగా ధాన్యాన్ని దించుకోవాలని, లారీలను వెయిటింగ్ చేయించవద్దన్నారు. సీపీ ఆధ్వర్యంలో ఆర్‌టీఏ, రెవెన్యూ శాఖలు వాహనాలను ఏర్పాటు చేయాలన్నారు. ధాన్యం సేకరణ వేగవంతం చేయడానికి మండల స్థాయిలో పంచాయతీ కార్యదర్శి, గ్రామ పాలనాధికారి, కొనుగోలు కేంద్రం ఇన్‌చార్జి సమన్వయం చేసుకోవాలన్నారు. రైతులు సన్న బియ్యం పండించడానికి వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యాచరణ తో ముందుకు సాగాలన్నారు. వర్షాకాలంలో 2.5లక్షల ఎకరాల్లో సన్నాలు సాగు చేసేలా కృషి చేయాలని సూచించారు. జిల్లాలో 46 వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న దిగుబడి వస్తుందని, ఇప్పటి వరకు 24,500 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు కొనుగోలు చేశాన్నారు. సమావేశంలో జిల్లా అధికారులు, రైస్ మిల్లర్లు, ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
విద్యకు అధిక ప్రాధాన్యం
హుస్నాబాద్: రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, బడుల బలోపేతమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం పట్టణంలోని ఆర్యవైశ్య భవన్‌లో విద్యా వారోత్సవాలు నిర్వహించారు. హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి మండలాలకు సంబంధించిన సర్పంచ్‌లు, కౌన్సిలర్లకు ఎడ్యుకేషన్ పై వర్క్‌షాపు నిర్వహించారు. అంతకముందు పట్టణంలోని ఆరపల్లె ధాన్యం కొనుగొలు కేంద్రం, కొత్త చెరువు నిర్మాణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అందరికీ ప్రభుత్వ ఉద్యోగం కావాలి, ప్రభుత్వ పథకాలు కావాలి, కానీ ప్రభుత్వ విద్య, వైద్యంపై సుముఖంగా లేరని అన్నారు. గ్రామ రూపు రేఖలు మారాలంటే సర్పంచ్‌లు క్రీయాశీలకంగా పని చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలన్నారు. కోహెడ మండలం తంగలపల్లిలో రూ.200 కోట్లతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, సౌకర్యాలతో ఇంటిగ్రేటేడ్ రెసిడెన్సియల్ స్కూల్ నిర్మిస్తున్నామని తెలిపారు. పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌లకు సర్పంచ్‌లు వెళ్లి స్కూల్ వాతావరణం ఎలా ఉందో చూడాలన్నారు. అనంతరం అత్యుత్తమ మార్కులు సాధించిన టెన్త్, ఇంటర్ విద్యార్థులను సన్మానించారు.
హుస్నాబాద్: రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, బడుల బలోపేతమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం పట్టణంలోని ఆర్యవైశ్య భవన్‌లో విద్యా వారోత్సవాలు నిర్వహించారు. హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి మండలాలకు సంబంధించిన సర్పంచ్‌లు, కౌన్సిలర్లకు ఎడ్యుకేషన్ పై వర్క్‌షాపు నిర్వహించారు. అంతకముందు పట్టణంలోని ఆరపల్లె ధాన్యం కొనుగొలు కేంద్రం, కొత్త చెరువు నిర్మాణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అందరికీ ప్రభుత్వ ఉద్యోగం కావాలి, ప్రభుత్వ పథకాలు కావాలి, కానీ ప్రభుత్వ విద్య, వైద్యంపై సుముఖంగా లేరని అన్నారు. గ్రామ రూపు రేఖలు మారాలంటే సర్పంచ్‌లు క్రీయాశీలకంగా పని చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలన్నారు. కోహెడ మండలం తంగలపల్లిలో రూ.200 కోట్లతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, సౌకర్యాలతో ఇంటిగ్రేటేడ్ రెసిడెన్సియల్ స్కూల్ నిర్మిస్తున్నామని తెలిపారు. పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌లకు సర్పంచ్‌లు వెళ్లి స్కూల్ వాతావరణం ఎలా ఉందో చూడాలన్నారు. అనంతరం అత్యుత్తమ మార్కులు సాధించిన టెన్త్, ఇంటర్ విద్యార్థులను సన్మానించారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామ్మూర్తి, జిల్లా విధ్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్ పర్సన్ చిత్తారి పద్మ, ఎంఈఓ బండారి మనీల, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
రైతులను ఇబ్బంది పెట్టవద్దు
మంత్రి పొన్నం ప్రభాకర్


